నీ లోపం వల్లే పిల్లలు కాలేదన్నందుకు.. స్నేహితుడి దారుణ హత్య...

Bukka Sumabala   | Asianet News
Published : Nov 09, 2020, 12:40 PM IST
నీ లోపం వల్లే పిల్లలు కాలేదన్నందుకు.. స్నేహితుడి దారుణ హత్య...

సారాంశం

నీ లోపం వల్లె నీకు పిల్లలు కావడం లేదన్నందుకు స్నేహితుడిని కొట్టి చంపిన దారుణ సంఘటన అదిలాబాద్ లో సంచలనం సృష్టించింది. ఇచ్చోడ మండలంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిరికొండ మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన జాదవ్‌ శ్రీనివాస్‌ అదే మండలంలోని పోన్న గ్రామనికి చెందిన బగ్నూరే జ్ఞానేశ్వర్‌ను దారుణంగా హత్య చేశాడు.

మండల కేంద్రంలోని మీషన్‌ భగీరథ పంప్‌ హౌస్‌ వద్ద హత్య చేసి మహారాష్టలోని మండివి అటవీ ప్రాంతంలో శవాన్ని పడేశాడు. జ్ఞానేశ్వర్‌ కనపడక పోవడతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు ఇచ్చోడ, సిరికొండ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

రంగంలోకి దిగిన ఇచ్చోడ సీఐ కంప రవీందర్‌ బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వారి వివారాల ప్రకారం అనుమానితులను ఆదుపులోకి తీసుకుని విచారించారు. జాదవ్‌ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా బగ్నూరే జ్ఞానేశ్వర్‌ను తానే హత్య చేసి శవాన్ని  మహారాష్ట్రలోని అటవీ ప్రాంతంలో పడేసినట్లు ఒప్పుకున్నాడు.  

బగ్నూరే జ్ఞానేశ్వర్, జాదవ్‌ శ్రీనివాస్‌ ఇద్దరు మంచి స్నేహితులు, పదేళ్ల క్రితం జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సిరికొండ జెడ్పీటీసీగా జాదవ్‌ శ్రీనివాస్, పోన్న ఎంపీటీసీగా బగ్నూరే జ్ఞానేశ్వర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేశారు. ఎన్నికలలో ఇద్దరూ ఓడిపోయారు.  కానీ అప్పటినుండి వీరిద్దరూ మంచి స్నేమితులయ్యారు. తరచుగా కలుసుకుంటుంటారు. 

అలాగే మూడు రోజుల కిత్రం ఇద్దరు కలిసి ఇచ్చోడ మండల కేంద్రంలోని మిషన్‌ భగీరథ పంప్‌ హౌస్‌ కు వెళ్లే దారిలో మద్యం సేవించారు.జ్ఞానేశ్వర్‌కు పెళ్లై ఎనిమిదేళ్లైనా ఇంకా పిల్లలు కాలేదు. దీంతో నీ లోపం వల్లె నీకు పిల్లలు కావడం లేదని జాదవ్‌ శ్రీనివాస్, జ్ఞానేశ్వర్‌ను రెచ్చ గొట్టాడు. దీంతో రెచ్చిపోయిన శ్రీనివాస్‌ జ్ఞానేశ్వర్‌ తలపై బండరాయితో బలంగా బాదడంతో జ్ఞానేశ్వర్‌ అక్కడిక్కడే మృతి చెందాడు. దీంతో ఎవరికి అనుమానం రాకుండా తన కారులో  జ్ఞానేశ్వర్‌ శవాన్ని మహారాష్ట్ర అటవీ ప్రాంతంలోని మండివి వద్ద పడేసి తనకు ఏమి తెలియనట్లుగా ఉన్నాడు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu