సీఎం కేసీఆర్‌ సతీమణి పెద్దమనసు.. ఆశ్రయం లేని వారికి అండగా...

By AN TeluguFirst Published Nov 9, 2020, 9:44 AM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభారాణి ఓ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరీంనగరంలోని తిర్మలాపూర్ కు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఇటీవల చనిపోయాడు. ఆ తరువాత కురిసిన భారీ వర్షాలకు వారి ఇళ్లు కూలి పోయింది. 

తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి కల్వకుంట్ల శోభారాణి ఓ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకు వచ్చి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరీంనగరంలోని తిర్మలాపూర్ కు చెందిన తిరుపతి అనే వ్యక్తి ఇటీవల చనిపోయాడు. ఆ తరువాత కురిసిన భారీ వర్షాలకు వారి ఇళ్లు కూలి పోయింది. 

అటు భర్త లేక, ఇటు ఇళ్లు లేక తిరుపతి భార్య, పిల్లలు, తల్లిదండ్రులు నిలువ నీడ లేక గ్రామంలో నిర్మాణంలో ఉన్న మున్నూరు కాపు సంఘ భవనంలో తలదాచుకుంటున్నారు. వీరి దీనస్థితిపై మీడియాలో కథనాలు వచ్చాయి. 

ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి సతీమణి కల్వకుంట్ల శోభారాణి చలించిపోయారు. తనవంతు బాధ్యతగా లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని ఆ కుటుంబానికి ప్రకటించారు. ఈ మేరకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. 

దీంతో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆదివారం శోభరాణి ప్రకటించిన లక్ష రూపాయలతోపాటు మరో రెండు లక్షల రూపాయలు కలిపి మూడు లక్షల రూపాయలు తిరుపతి కుటుంబసభ్యులకు అందజేశారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్‌ మాట్లాడుతూ ఇక్కడి పరిస్థితిని మీడియా ద్వారా తెలుసుకున్న సీఎం సతీమణి శోభారాణి తనకు ఫోన్‌చేసి తనవంతుగా లక్ష రూపాయలు విరాళంగా అందజేస్తున్నామని, మరికొంత సొమ్ము కలిపి కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఆమె ఆదేశాల మేరకు బాధిత కుటుంబాన్ని పరామర్శించి డబ్బు లు అందజేసినట్లు పేర్కొన్నారు. 

ఈ  కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయిస్తానని, వారి పిల్లలను గురుకులాల్లో చేర్పించి చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటానన్నారు. ఆయన వెంట ప్యాక్స్‌ చైర్మన్‌ వీర్ల వెంకటేశ్వర్‌రావు, మాజీ ఎంపీపీ మార్కొం డ కిష్టారెడ్డి, సర్పంచ్‌ బక్కశెట్టి నర్సయ్య, చొప్పదండి ఏఎంసీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

click me!