కాజీపేటలో దారుణం జరిగింది. తమ కూతురిని ప్రేమిస్తున్నాడమే అనుమానంతో అమ్మాయి తల్లిదండ్రులు పాశవికంగా ప్రవర్తించారు. ఓ యువకుడిని అనాగరికంగా బంధించి, చిత్ర హింసలకు గురి చేశారు. కొడుతూ.. వీడియోలు, ఫొటోలు తీసి...
కాజీపేట : తమ అమ్మాయిని ప్రేమిస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని పక్కాplan తో ఇంట్లో బంధించి విచక్షణా రహితంగా attackచేసిన ఘటన శుక్రవారం Kazipet పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. యువకుడి తండ్రి, యువతి బంధువులు పోలీసులకు పరస్పర ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదైంది. బాధితుడి తండ్రి శుక్రవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన బైరపాక ప్రభుదాస్ కాంట్రాక్టర్ గా పనిచేస్తూ డీజిల్ కాలనీలో కుటుంబంతో అద్దెకు ఉండేవాడు. ఆయన కుమారుడు ప్రసాద్ ఇంటి యజమాని కూతురుతో ప్రేమగా ఉంటున్నాడని అనుమానంతో గొడవలు జరిగాయి. దీంతో ప్రభుదాస్ కుటుంబం దూరంగా వేరే ఇంటికి మారింది. ఈ క్రమంలో బుధవారం అమ్మాయితో బంధువులు ప్రసాద్ కు ఫోన్ చేయించి ఇంటికి పిలిపించారు.
వచ్చిన ప్రసాద్ ను ఇంట్లోకి తీసుకువెళ్లి.. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టేసి విచక్షణారహితంగా కొట్టారు. దీంతో, ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. దాడి చేస్తూ ఫోటోలు, వీడియోలు తీసి ప్రసాద్ మిత్రులకు పంపించడంతో విషయం వెలుగు చూసింది. బాధితురాలి తండ్రి బంధువులు, మిత్రులతో వెళ్లి ప్రసాద్ ను విడిచి పెట్టాలని వేడుకోగా మరోమారు అమ్మాయి జోలికి రావద్దని రాయించుకుని వదిలివేశారు.
యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉండగా యువకుడితో పాటు అతని కుటుంబ సభ్యులపై అమ్మాయిని వేధిస్తున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ గట్ల మహేందర్ రెడ్డి శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీరితోపాటు యువకుడిని చితకబాదిన మాచర్ల శేఖర్ తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.
ఇదిలా ఉండగా,
ప్రేమ పేరుతో వంచనకు గురైన యువతి ప్రియుడి ఇంటి ముందు suicideకు ప్రయత్నించింది. ఈ ఘటన తిరుపత్తూరు జిల్లా జోలార్ పేటలో శుక్రవారం జరిగింది. వివరాల ప్రకారం.. chennai అశోక్ నగర్ కు చెందిన యువతి (26) బ్యాంక్ లో పనిచేస్తోంది. ఈమెకు చెన్నైలో Taxi driverగా పనిచేస్తున్న తిరుపత్తూరు జిల్లా జోలార్ పేట సమీపంలోని అచ్చ మంగళం గ్రామానికి చెందిన రామన్ తో పరిచయం ఏర్పడింది.
ఇద్దరూ ప్రేమించుకున్నారు. marriage చేసుకుంటానని నమ్మించి రామన్ పలుమార్లు ఆమెపై Sexual assault చేశాడు. ఆ తరువాత వివాహం చేసుకోవాలని యువతి పట్టుబట్టడంతో Raman ఎవరికీ తెలియకుండా సొంతూరుకు చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న యువతి జనవరి 27న జోలార్ పేటలోని రామన్ ఇంటి వద్దకు చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది.
అయితే, ఈ వివాహానికి వారు అంగీకరించకపోవడంతో యువతి రామన్ ఇంటి ముందే Protestకు కూర్చుంది. 9 రోజులైనా పట్టించుకోకపోవడంతో శుక్రవారం Sanitizer తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన స్థానికులు ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు విచారణ చేస్తున్నారు.