ఖమ్మంలో దారుణం: మైనర్ బాలికపై అత్యాచారయత్నం, పెట్రోల్ పోసి నిప్పు

Published : Oct 05, 2020, 05:29 PM IST
ఖమ్మంలో దారుణం: మైనర్ బాలికపై అత్యాచారయత్నం, పెట్రోల్ పోసి నిప్పు

సారాంశం

ఇంట్లో పనిచేస్తున్న బాలికపై ఇంటి యజమాని కొడుకు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకొంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.


ఖమ్మం: ఇంట్లో పనిచేస్తున్న బాలికపై ఇంటి యజమాని కొడుకు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఖమ్మం పట్టణంలో చోటు చేసుకొంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

ఖమ్మం పట్టణంలోని ముస్తఫానగర్ లో సుబ్బయ్య ఇంట్లో మైనర్ బాలికను ఇంట్లో పనికి పెట్టారు.

సుబ్బయ్య కొడుకు మారయ్య మద్యం మత్తులో మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే బాలికతో కేకలు వేసింది. అయితే ఈ విషయం బయటకు వస్తోందనే భయంతో మారయ్య ఆ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. బాలిక వీపు బాగం పూర్తిగా కాలిపోయింది. మారయ్య కుటుంబానికి చెందినవారే  ఆ బాలికను ఆసుపత్రికి తరలించారు.

వారం రోజులుగా ఖమ్మం ఆసుపత్రిలో బాలికకు చికిత్స చేయిస్తున్నారు. బాలిక వైద్య ఖర్చులను తామే భరిస్తామని మారయ్య కుటుంబం హామీ ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని తొలుత బాలిక కుటుంబసభ్యులు బయటకు చెప్పలేదు. 

బాలిక పరిస్థితి కొంత విషమంగా ఉండడంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?