భార్య కోప్పడిందని భర్త ఆత్మహత్య.. అప్పు చేసావన్నందుకు ఆయువు తీసుకున్నాడు...

Published : Feb 14, 2022, 06:33 AM IST
భార్య కోప్పడిందని భర్త ఆత్మహత్య.. అప్పు చేసావన్నందుకు ఆయువు తీసుకున్నాడు...

సారాంశం

చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీసుకోవడం ఇటీవలి కాలంలో ఎక్కువైపోయింది. ముఖ్యంగా మహిళలకంటే పురుషులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. అలా హైదరాబాద్ అల్వాల్ లో భార్య కోప్పడిందని భర్త సూసైడ్ చేసుకున్నాడు.

ఆల్వాల్ :  భార్య మందలించడంతో మనస్తాపంతో GHMC కాంట్రాక్టు ఉద్యోగి suicideకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం ఆల్వాల్ లో నివసించే అంజయ్య (32) జిహెచ్ఎంసి చెత్త తరలింపు వాహనం driverగా పని చేస్తున్నాడు. కొంతకాలం క్రితం తండ్రి, తమ్ముడి వద్ద అప్పు తీసుకుని house కట్టుకున్నాడు. అయితే సకాలంలో ఆ debt చెల్లించకపోవడంతో  కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి.
 
ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం  అంజయ్య తమ్ముడు.. వదిన లక్ష్మమ్మ తో గొడవ పడ్డాడు. తీవ్రంగా వాగ్వాదం జరిగింది. దీంతో సాయంత్రం ఇంటికి వచ్చిన భర్తకు ఆమె జరిగిన గొడవ మొత్తం చెప్పింది.. ఇలా మాటలు పడడానికి, గొడవకు భర్తే కారణం అని కోప్పడింది. దీంతో మనస్థాపంతో అంజయ్య ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. 

నిరుడు నవంబర్ లో ఏలూరులో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. భార్య పోలీసులకు ఫిర్యాదు చేసిందని మనస్తాపానికి గురైన భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా గణపవరానికి చెందిన బాలరాజుకు (30)ఏలూరు శివారు చొదిమెళ్లలో ఉంటున్న జ్యోతికి కొంతకాలం కిందట వివాహమయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. కూలి పనులు చేసుకుంటూ బాలరాజు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 

అత్తింట్లో బంధువు చనిపోవటంతో రెండు వారాల కిందట చొదిమెళ్లకు పిల్లలో సహా వచ్చారు. నవంబర్ 17న భార్యభర్తల మద్య conflict రావడంతో జ్యోతి చీమలమందు తాగి suicide attemptకి పాల్పడింది. ఇది గమనించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీంతో చికిత్స అనంతరం కోలుకున్న ఆమె.. తనను భర్త harrassement చేస్తున్నాడంటూ 100కు ఫోన్ చేయడంలో rural policeలు బాలరాజును విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు రావాలని సమాచారం ఇచ్చారు.

గురువారం జ్యోతి తన తండ్రితో స్టేషన్ కు వెళ్లగా .. బాలరాజు పవరు పేట రైల్వేస్టేషన్ సమీపంలోకి వచ్చి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రేల్వై ఎస్సై రమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

కాగా, 2021 ఆగస్ట్ లో ఖమ్మంలో భార్య వేధింపులు తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మానసికంగా వేధిస్తుందనే కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్ హెచ్ వో సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన కిన్నెర జాంబవంతుడు (32) రామనర్సయ్యనగర్ కు చెందిన మహిళను పెళ్లి చేసుకుని నాలుగేళ్ల నుంచి అక్కడే ఉంటున్నాడు. 

ఈ నేపథ్యంలో భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తూ జాంబవంతుడితో నిత్యం గొడవపడేది. దీంతో మనస్తాపానికి గురైన అతడు ఆగస్ట్ 16 రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఓ కూతురు ఉంది. జాంబవంతుడు తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?
KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu