
కామారెడ్డి : భార్యతో గొడవపడి suicideకు ప్రయత్నిస్తున్న యువకుడిని పోలీసులు సాంకేతిక సహాయంతో కాపాడారు. ఈ ఘటన kamareddy జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో నివసించే అజీమ్ భార్య చంద్రలేఖతో బుధవారం సాయంత్రం గొడవ పడ్డాడు. అనంతరం ఇంట్లో నుంచి బయటికి వెళ్లి రాత్రి 7గంటల సమయంలో చంద్రలేఖకు వీడియో కాల్ చేసి ఉరేసుకొని చనిపోతున్నానంటూ చెప్పాడు.
ఆమె వెంటనే 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇందిరాగాంధీ స్టేడియం సమీపంలోని ముళ్లపొదల్లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకున్నారు. చెట్టుకు ఉరివేసుకోబోతున్న అజీమ్ ను కిందికి దింపి నచ్చచెప్పారు. తక్షణం స్పందించి ప్రాణాలు కాపాడిన సీఐ నరేష్, కానిస్టేబుళ్లు శరత్ బాబు, హోంగార్డు అమీర్ లను జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఏఎస్పి అన్యోన్య, డిఎస్పి సోమనాథం అభినందించారు.
ఇదిలా ఉండగా, నిరుడు అక్టోబర్ లో ఓ యువతి ఇలాగే భర్తకు వీడియో కాల్ చేసి లైవ్ లో ఉరి వేసుకుంది. భర్తకు వీడియో కాల్ చేసిన భార్య లైవ్లో ఉరేసుకున్న సంఘటన మదనపల్లిలో జరిగింది. Madanapalle టూ టౌన్ పోలీసుల కథనం మేరకు … అనంతపురం జిల్లా బాబే నాయక్ తండాకు చెందిన చక్రి నాయక్, కమలమ్మ దంపతులు కొంతకాలం కిందట ఉపాధి నిమిత్తం మదనపల్లెకు వలసొచ్చారు.
పట్టణంలోని ఎస్బిఐ కాలనీ ఎక్స్టెన్షన్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని నివాసముంటున్నారు. కాగా చక్రే నాయక్ వాచ్మెన్ గా, కమలమ్మ ఇళ్ళల్లో పాచి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఒక్కగా నొక్క కుమార్తె రమ్య శ్రీ (24) ఏడేళ్ల కిందట కర్ణాటక రాష్ట్రం ఏలూరుకు చెందిన చందు నాయక్ తో వివాహం అయ్యింది.
వీరికి 11 నెలల కుమార్తె ఉంది. ఈ నేపథ్యంలో దంపతుల మధ్య కొంత కాలంగా family disputesపై గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త పై అలిగిన రమ్య శ్రీ కొద్ది రోజుల కిందట పుట్టింటికి వచ్చేసింది.తనను కాపురానికి తీసుకెళ్లాలని రమ్యశ్రీ కొద్దిరోజులుగా భర్తను ఫోన్ చేసి అడుగుతోంది. చందు నాయక్ స్పందించలేదు. ఇదిలా ఉండగా రమ్యశ్రీ శుక్రవారం భర్తకు video call చేసి కాపురానికి తీసుకెళ్లాలని కోరింది.
అయితే భర్త ఏ విషయం చెప్పకపోవడంతో చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. దీంతో చందు వెంటనే అత్త కమలమ్మ కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. కాగా ఇళ్లల్లో పనులు చేసేందుకు వెళ్లిన ఆమె హుటాహుటిన ఇంటికి చేరుకుని ఫ్యానుకు వేలాడుతున్న కుమార్తెను చూసి బిగ్గరగా కేకలు వేసింది.
స్థానికులు వచ్చి రమ్యశ్రీని చున్నీ తీసి, కిందికి దించి చూడగా ఆమె అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. అల్లుడు వేధింపుల కారణంగానే తన బిడ్డ suicide చేసుకుందని రమ్యశ్రీ తల్లి పోలీసులకు చెప్పింది. గతంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని పేర్కొంది. ఆ తరువాత మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రమోహన్ చెప్పారు.