నిజామాబాద్ లో నవీన్ హత్యలాంటి ఘటన.. తన ప్రేయసిని ప్రేమించాడని స్నేహితుడి హత్య...!!

Published : Mar 02, 2023, 06:56 AM ISTUpdated : Mar 02, 2023, 06:57 AM IST
నిజామాబాద్ లో నవీన్ హత్యలాంటి ఘటన.. తన ప్రేయసిని ప్రేమించాడని స్నేహితుడి హత్య...!!

సారాంశం

తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తన ప్రేయసిని స్నేహితుడు ప్రేమిస్తున్నాడని దారుణంగా హత్య చేశాడో వ్యక్తి. ఐదునెలల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. 

నిజామాబాద్ :  రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన నవీన్ హత్య లాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో మరొకటి వెలుగు చూసింది. తను ప్రేమించిన అమ్మాయి మీద తన స్నేహితుడు కన్నేశాడని అతి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలో వెలుగు చూసింది.  అయితే హైదరాబాదులో వెలుగులోకి వచ్చి, సంచలనం సృష్టించిన నవీన్ ను హరిహరకృష్ణ చంపిన ఘటన కంటే ముందే  ఇది జరిగినా... ఆలస్యంగా వెలుగు చూసింది. ఐదు నెలల క్రితం ఈ  దారుణ ఘటన జరిగింది. నందిపేట ఎస్సై శ్రీకాంత్ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఇలా తెలిపారు…

నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని ఆంధ్రానగర్ పంచాయతీ పరిధిలో వెంకటేశ్వర కాలనీ ఉంది. ఈ కాలనీలో యానాదులు (సంచార కుటుంబాలు) ఉంటున్నాయి. ఈ కాలనీలో ఉండే చిన వెంకటరమణ అనే మహిళ కుమారుడు కార్తీక్ (22), బాపట్ల రాజు (22) అనే యువకుడు ఇద్దరు స్నేహితులు. అయితే, ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతి బాపట్ల రాజు కుటుంబానికి తెలుసు.  ఆమె తరచుగా వారి ఇంటికి వచ్చేది. ఈ క్రమంలోనే రాజు, కార్తీక్ ఇద్దరు ఆ యువతి ప్రేమించారు. రాజు ఆ యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.

నవీన్ హత్య కేసు : మూడు సార్లు విచారణ, చివరికి కౌన్సెలింగ్ .. నోరువిప్పని హరిహరకృష్ణ గర్ల్‌ఫ్రెండ్

కార్తీక్ కూడా ఆమెను ప్రేమిస్తున్న సంగతి తెలిసి…తాను ప్రేమిస్తున్న యువతిని, పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయిని స్నేహితుడు కూడా ప్రేమిస్తున్నాడని కార్తీక్ మీద పగ పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే కార్తీక్ ను ఎలాగైనా చంపేయాలని అనుకున్నాడు. తన తమ్ముడైన బొజ్జ హరీష్ తో కలిసి కార్తీక్ హత్యకు ప్రణాళిక వేశాడు. 2022 సెప్టెంబర్ 20న  నందిపేట్ శివారులోని ఎల్లమ్మగుడి దగ్గరికి కార్తీక్ ను తీసుకువెళ్లి అక్కడ మద్యం తాగించారు. ఆ తర్వాత బొజ్జ హరీష్, రాజు కలిసి కార్తీక్ ను పక్కనే ఉన్న విజయనగరం గుట్ట వద్దకు తీసుకువెళ్లారు.

అక్కడ కార్తీక్ తల మీద కర్రలతో దాడి చేశారు. విచక్షణారహితంగా దాడి చేయడంతో కార్తీక్ అక్కడికక్కడే చనిపోయాడు. ఆ తర్వాత అతడు చనిపోయాడని నిర్థారించుకొని విజయనగర గుట్ట ప్రాంతాల్లో బండరాళ్ల మధ్య మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత సదరు యువతిని రాజు పెళ్ళాడాడు. మరోవైపు కార్తీక్ కనిపించకపోవడంతో అతను బతుకుతెరువు కోసం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి ఉంటాడని తల్లి చిన్న వెంకటరమణ అనుకుంది. ఆమె భర్త అంతకుముందే చనిపోవడంతో.. పెద్ద కుమారుడు చిన్న కుమారుడుతో కలిసి ఉంటుంది.  

చిన్న కుమారుడు బతుకుతెరువు కోసం ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాడని భావించినా కూడా అతడి ఆచూకీ కోసం పెద్ద కొడుకుతో కలిసి ఇరుగుపొరుగు దగ్గర ఆరా తీస్తూ ఉండేది. సంచార జాతులు కావడంతో అలా వెళ్లడం మామూలే కదా అనుకుని కూడా వదిలేశారు. అయితే, చెప్పకుండా వెళ్లడం.. తర్వాత కాంటాక్ట్ లో లేకపోవడంతో తెలిసిన వాళ్ళ దగ్గర అడుగుతున్నారు. కాగా, ఇటీవల నవీన్ హత్య కేసు వెలుగులోకి రావడంతో.. అబ్దుల్లాపూర్మెట్ లో జరిగిన హత్యలాంటి ఘటన తమ గ్రామంలోనూ జరిగిందని కొందరు యువకులు తల్లి చిన వెంకటరమణకు చెప్పారు. 

ఆమె కొడుకు కార్తీక్ ను చంపేసి విజయనగరం గుట్టల్లో పడేశారని తెలిపారు. దీంతో వెంటనే వారు పోలీసులను సంప్రదించగా పోలీసులు విజయనగరం గుట్ట ప్రాంతంలో వెతకగా ఓ ఆస్తిపంజరం కనిపించింది. దీనికి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి ఫోర్ అండ్ సీక్ విభాగ ప్రొఫెసర్ నాగమోహన్రావు ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు.  అస్థిపంజరం కార్తీక్ దిగా నిర్ధారించారు. విషయం బయటపడిందని తెలియడంతో నిందుతుల పరారయ్యారు. వారికోసం వెతుకుతున్నామని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం