సొంత బావనే కర్కశంగా కడతేర్చాడో బావమరిది. తోడబుట్టిన సోదరి పదికాలాలు పచ్చగా ఉండాలని కోరుకోవాల్సిన సోదరుడే ఆమె జీవితాన్ని చీకటి మయం చేశాడు. వరంగల్ అర్బన్ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు శివారులోని సుభాష్ నగర్ సమీపంలో ఈ దారుణం జరిగింది.

ఓ యువకుడిని సొంత బావమరిదే మద్యం బాటిల్ తో గొంతుపై పొడవడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. హసన్‌పర్తికి చెందిన మోతే చందు (26), పస్త్రం అయికుమార్ సొంత బావ బావమరుదులు.
స్థానికంగా బియ్యం వ్యాపారం చేసే చందు వద్ద అయికుమార్ సహాయకుడిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని చింతగట్టుకు గురువారం వచ్చి మద్యం తాగారు. ఈ క్రమంలో ఇరువురి నడుమ ఘర్షణ జరగగా, అక్కడ బెల్టు షాపు వద్ద ఉన్న మద్యం బాటిల్ పగలగొట్టి చందు పై అయికుమార్ దాడి చేయగా మృతిచెందాడు.
సమాచారం అందుకున్న పోలీసు ఇన్‌స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి, ఎస్సై చంద్రమోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. చందు ను హత్య చేశాక నిందితుడు అయి కుమార్ అక్కడే ఉన్నాడు. కుటుంబ సమస్యల కారణంగా మాటా మాటా పెరిగిందని చెప్పుకొచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, ఓ వివాహిత తో సంబంధం కొనసాగిస్తున్నట్లు కుమార్ పై చందు ఆరోపణలు చేసినట్లు సమాచారం. క్రమంలో గొడవ జరగగా మద్యం మత్తు తోపాటు గంజాయి సేవించిన ఆయన హత్య చేసినట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య,కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉండగా చందును హత్య చేసేందుకు తమతో పడని వారే కుమార్కు డబ్బులు ఇచ్చి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపించడం గమనార్హం.