మంటల్లో పూరిగుడిసె... వృద్ధ దంపతుల సజీవ దహనం

Arun Kumar P   | Asianet News
Published : Apr 16, 2021, 12:24 PM IST
మంటల్లో పూరిగుడిసె...  వృద్ధ దంపతుల సజీవ దహనం

సారాంశం

పూరిగుడిసెకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని వృద్ధ దంపతులు సజీవదహనం అయిన సంఘటన కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో సంభవించింది. 

సిద్దిపేట: అర్థరాత్రి ప్రమాదవశాత్తు ఇంట్లో మంటలు చెలరేగి నిద్రలోనే వృద్ధ దంపతులు సజీవదహనం అయిన విషాద సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచచేసుకుంది. జిల్లాలోని కోహెడ మండలం తంగళ్ళపల్లి గ్రామంలో ఈ దుర్ఘటన సంబవించింది. 

తంగళ్ళపల్లి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు యాద నరసయ్య (90), యాద లచ్చమ్మ (80) పక్షవాతంతో బాధపడుతూ కదల్లేని పరిస్థితుల్లో పూరిగుడిసెలో వుంటున్నారు. వీరికి ముగ్గురు కొడుకులు వున్నప్పటికి అందరూ ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాల్లో వెళ్లిపోయారు. దీంతో దంపతులిద్దరు నిస్సహాయ స్థితిలో గుడిసెలోనే జీవితాన్ని ఈడుస్తున్నారు. 

అయితే గురువారం అర్ధరాత్రి షాట్ సర్క్యూట్ కారణంగా గుడిసెలో మంటలు చెలరేగాయి. దీంతో కదల్లేని పరిస్థితుల్లో వున్న వృద్ధ దంపతులిద్దరూ ఈ మంటల్లో చిక్కుకుని సజీవ దహనం అయ్యారు. ఇవాళ తెల్లవారుజామున గుడిసెకు నిప్పు అంటుకున్న విషయాన్ని చుట్టుపక్కలవారు గమనించి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే దంపతులిద్దరూ కాలిన గాయాలో మృతిచెంది వుండటాన్నిగుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అలాగే వీరి కుమారులకు ఈ ఘటనపై సమాచారం అందించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert: మ‌రో 2 రోజులు చుక్క‌లే.. దారుణంగా ప‌డిపోనున్న ఉష్ణోగ్ర‌త‌లు
హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?