ప్రేమ పేరిట బాలికకు గాలం.. మాయ చేసి రూ.5లక్షలు కాజేసి

By telugu teamFirst Published Nov 8, 2019, 8:13 AM IST
Highlights

తనకు ఎంటెక్‌ ఫీజు, బైక్‌, ఇతర అత్యవసరాలున్నాయంటూ ఆ బాలికకు మాయమాటలు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాలిక తండ్రి రిజిస్ర్టేషన్‌ కోసం ఇంట్లో దాచిన డబ్బులోంచి విడతల వారీగా గతేడాది మే నెల నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు సుమారు రూ.5 లక్షలు సుమంత్‌కు ఇచ్చింది. 

ప్రేమ పేరిట స్కూల్ విద్యార్థినికి గాలం వేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి.. విడతల వారీగా రూ.5లక్షలు కాజేశాడు. స్కూల్లో పనిచేస్తూనే.. అదే స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థిని ని మోసం చేశాడు. ఆమె వద్ద నుంచి ఇంక డబ్బులు రావు అని తేల్చుకున్నాక... ఆమెకు కనిపించకుండా తిరగడం మొదలుపెట్టాడు.  ల్‌కు రాకుండా మూడు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న ఆ ప్రబుద్ధున్ని ఎట్టకేలకు సరూర్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

పూర్తి వివరాల్లోకి వెళితే...  నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం కొరివిని గూడెంగ్రామానికి చెందిన సుమంత్‌రెడ్డి (21) చైతన్యపురిలో నివసిస్తూ ఓ స్కూల్లో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే తమ స్కూల్‌కే వస్తున్న ఓ విద్యార్థినితో గతేడాదిగా చనువుగా ఉంటున్నాడు. ప్రేమిస్తున్నానంటూ మాయమాటలు చెప్పాడు.
 
తనకు ఎంటెక్‌ ఫీజు, బైక్‌, ఇతర అత్యవసరాలున్నాయంటూ ఆ బాలికకు మాయమాటలు చెప్పాడు. అతడి మాటలు నమ్మిన బాలిక తండ్రి రిజిస్ర్టేషన్‌ కోసం ఇంట్లో దాచిన డబ్బులోంచి విడతల వారీగా గతేడాది మే నెల నుంచి ఈ ఏడాది జూన్‌ వరకు సుమారు రూ.5 లక్షలు సుమంత్‌కు ఇచ్చింది. 

దీంతో బాలిక నుంచి డబ్బులు కాజేసిన విషయం ఎక్కడ భయటపడుతుందోననే భయంతో మూడు నెలలుగా పాఠశాలకు రావ డంలేదు. అయితే గత నెలలో రిజిస్ర్టేషన్‌ ఉండడంతో ఇంట్లో డబ్బులు చూసుకున్న బాలిక తండ్రి ఐదు లక్షల నగదు తక్కువగా ఉండడం గమనించాడు. కుటుంబ సభ్యులందర్ని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. దీంతో గత నెల 26న సరూర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సుమంత్‌రెడ్డిని అరెస్ట్‌ చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు.

click me!