తెలంగాణ‌లో 'ఆర్మీ విలేజ్'.. మామిడిపల్లికి ఆ పేరెందుకు వ‌చ్చింది?

Published : May 15, 2025, 06:11 PM IST
తెలంగాణ‌లో 'ఆర్మీ విలేజ్'.. మామిడిపల్లికి ఆ పేరెందుకు వ‌చ్చింది?

సారాంశం

Mamidipally - Army Village: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ఉన్న మమిడిపల్లి గ్రామం 20 మంది ఆర్మీ జవాన్లతో "ఆర్మీ విలేజ్"గా గుర్తింపు పొందింది.  

Army Village: నిజామాబాద్ జిల్లాలోని మమిడిపల్లి గ్రామం "ఆర్మీ విలేజ్"గా పేరుగాంచింది. మక్లూర్ మండలానికి చెందిన ఈ చిన్న గ్రామం, నిజామాబాద్-జగదల్‌పూర్ జాతీయ రహదారి 63 పై ఉంది. ఈ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడి యువత దేశరక్షణలో భాగమవుతూ భారత సైన్యంలో ప్రాముఖ్యతను సాధించారు. ప్రస్తుతం దాదాపు 20 మంది యువకులు భారత ఆర్మీలో సేవలందిస్తున్నారు. వారిలో చాలా మంది అంతర్జాతీయ సరిహద్దుల్లో డ్యూటీలో ఉన్నారు.

భారత-పాకిస్థాన్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో, మమిడిపల్లి గ్రామస్తులు తమ గ్రామానికి చెందిన సైనికుల గురించి నిరంతరం సమాచారం తెలుసుకుంటూ ఉంటారు. ప్రత్యేకించి కుటుంబ సభ్యులు, సైనికుల భద్రతపై శ్రద్ధ చూపుతూ, టెలివిజన్ ద్వారా యుద్ధ పరిణామాలను గమనించేవారు. ఈ గ్రామంలో ఆర్మీలో చేరిన తొలి వ్యక్తిగా చంద్రశేఖర్ గుర్తింపు పొందారు. ఇరవై సంవత్సరాల క్రితం ఆయన భారత సైన్యంలో చేరారు. ఆ త‌ర్వాత ఇతని ప్రేరణతో మరికొంతమంది యువకులు ఆర్మీకి, తెలంగాణ పోలీస్ విభాగంలో చేరారు. ప్రస్తుతం ఆరుగురు మాజీ సైనికులు గ్రామంలోనే నివసిస్తున్నారు. ప‌లువురు జమ్ము కాశ్మీర్ లో సర్వీసు చేస్తున్నారు.

గ్రామ మాజీ సర్పంచ్ చింత మల్లారెడ్డి మాట్లాడుతూ.. "మమిడిపల్లి పేరు భారతదేశవ్యాప్తంగా వినిపించడంలో ఇక్కడి యువకుల ఆర్మీలో చేరడమే ప్రధాన కారణం. భారత-పాకిస్థాన్ మిలటరీ వివాదం తర్వాత మమిడిపల్లిని ‘ఆర్మీ విలేజ్’గా పిలవడం ప్రారంభమైంది" అని పేర్కొన్నారు. త‌మ బిడ్డ‌లు ఆర్మీలో ఉంటూ దేశ‌ర‌క్ష‌ణ‌లో త‌మంతూ పాత్ర పోషించ‌డం గ‌ర్వంగా ఉంద‌ని ఇక్క‌డి సైనిక కుటుంబాలు చెబుతున్నాయి. అయితే, ఇటీవల  ప‌హల్‌గామ్ దాడి తర్వాత అతని భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఇటీవల ఉద్రిక్తతల కారణంగా త‌మ‌వారి సెలవులు రద్దయ్యాయని గ్రామ‌స్తులు చెప్పారు. గ్రామస్థులు టీవీల ముందు కూర్చుని యుద్ధ పరిణామాలపై నిరంతరంగా దృష్టిపెట్టి ఉండేవారనీ, భారత-పాకిస్థాన్ కాల్పుల విరమణ  అనంతరం ఊపిరి పీల్చుకున్నామని పేర్కొన్నారు. దేశ రక్షణలో భాగంగా మమిడిపల్లి యువత ప్రదర్శిస్తున్న ప్రగతి, దేశ‌ప‌ట్ల భ‌క్తి, బాధ్య‌త మనకు గర్వకారణంగా నిలుస్తోంది. ఈ గ్రామం, దేశ భద్రతకు అంకితభావంతో సేవలందిస్తున్న గ్రామాల మధ్య ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

ఇదిలావుండగా, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారత సైన్యం పాకిస్తాన్‌లోని ఉగ్రవాద గ్రూపులపై జరిపిన దాడులను నివాసితులు స్వాగతించడంతో సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా యువకులు అనేక ప్రదేశాలలో జరిగిన ర్యాలీలలో ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాను ఊపుతూ, సాయుధ దళాలకు మద్దతుగా నినాదాలు చేశారు. నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ ఇతర ప్రదేశాలలో ర్యాలీలు జరిగాయి. మన సైనికులకు మద్దతును ప్రకటించాయి. మామిడిపల్లి గ్రామంలో వైమానిక దాడుల ప్రకటన తర్వాత ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

బండి భగీరథ్ ను రిమాండ్ కు తరలించిన పోలీస్ లు | Bandi Bhagirath Case | Asianet News Telugu
Bandi Bhagirath Case: బండి భగీరథ్ పై కవిత సంచలన కామెంట్స్ | Asianet News Telugu