కోల్ కత్తా సెక్రటేరియట్ ఎలా ఉందో చూడండి (వీడియో)

First Published Mar 19, 2018, 4:29 PM IST
Highlights
  • అంగులు, ఆర్భాటాలకు దూరంగా బెంగాల్ సచివాలయం
  • చెక్క కుర్చీలు, పాత కాలం నాటి బల్లలు
  • ఆడంబరాలకు దూరంగా సిఎం మమతా బెనర్జీ

సచివాలయం అనగానే ఖరీదైన ఫర్నీచర్, ఆడంబరాలకు కేరాఫ్ అడ్రస్ అనుకుంటాం. అడుగడుగునా.. లగ్జరీ కొట్టొచ్చినట్లు కనబడాలన్న ఊహల్లో ఉంటాం. గోడలకు నగిషీలు,  ఇంద్రభవనాలను తలపించేలా ఉంటాయి అనుకుంటాం కదా? తెలంగాణలో కానీ.. ఆంధ్రప్రదేశ్ లో కానీ.. సచివాలయం కానీ.. ప్రభుత్వ భవనాలన్నీ ఖరీదైనవిగా కనబడతాయి. సిఎం ల నివాస భవనాలైతే మరీ చాలా కాస్టిలీ గురూ అని చెబుతుంటారు.

కానీ పశ్చిమబెంగాల్ సచివాలయం చాలా సాదాసీదాగా కనబడుతున్నది. తెలంగాణ సిఎం ప్రత్యేక విమానంలో కేసిఆర్ కోల్ కత్తా వెళ్లి పశ్చిమబెంగాల్ సిఎం మమతా బెనర్జీతో సచివాలయంలో భేటీ అయ్యారు. సచివాలయం ముందు దిగగానే బెంగాల్ సిఎం మమత కేసిఆర్ బృందానికి స్వాగతం పలికారు. ఆమె ఒక చిన్న బొకే కేసిఆర్ కు ఇచ్చి ఆహ్వానించారు. తర్వాత తెలంగాణ సిఎం కేసిఆర్ పెద్ద బొకే ఆమెకు ఇచ్చారు. తర్వాత సమావేశమందిరంలో ఉన్న ఫర్నీచర్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక ఎమ్మార్వో ఆఫీసులో ఉండే మోతాదులో సమావేశమందిరంలో ఫర్నీచర్ ఉన్నది. చెక్క కుర్చీల మీద  ఇద్దరు సిఎం లు కూర్చుని మాట్లాడుకున్నారు. పాతకాలం నాటి అద్దంతో కూడిన టేబుల్ ఉంది.

 

దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం కాబట్టి మన రాష్ట్ర స్టేచర్ కు తగ్గట్టుగా మన సచివాలయం ఉండాలని సిఎం కేసిఆర్ చెబుతూ ఉండేవారు. ఇప్పుడున్న సచివాలయంలో సరైన సదుపాయాలు లేవని కేసిఆర్ బాధపడేవారు. అందుకే సకల సౌకర్యాలతో కొత్త సచివాలయం నిర్మించేందుకు కేసిఆర్ గత నాలుగేళ్లుగా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

ఇక ఎపి సిఎం చంద్రబాబు సైతం ఇదే తరహాలో వ్యవహరించారు. కార్పొరేట్ స్టయిల్ లో సచివాలయం ఉండాలన్న భావనలో ఎపి సిఎం చంద్రబాబు ఉన్నారు. అమరావతిలో సైతం కార్పొరేట్ స్టయిల్ లోనే భవనాల నిర్మాణం, ఫర్నీచర్ వినియోగం ఉంటున్నాయి. సమావేశమందిరాలు రాజభవనాలను తలపించేలా ఉన్నాయి. సకల సదుపాయాలు కల్పించబడి ఫైవ్ స్టార్ హోటళ్ల మాదిరిగా ఉంటాయి.

ఆడంబరాలకు పెట్టింది పేరైన తెలుగు రాష్ట్రాల్లో పాలక భవనాలు, ఖరీదైన కార్లు, బంగళాలు చూసి కలకత్తా లోని తాత్కాలిక సచివాలయం నాబన్న భవన్ ను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. 

click me!