కేసీఆర్‌కు మమత ఫోన్: కోల్‌కత్తా ర్యాలీకి డౌటే

Published : Jan 18, 2019, 03:20 PM ISTUpdated : Jan 18, 2019, 03:25 PM IST
కేసీఆర్‌కు మమత ఫోన్: కోల్‌కత్తా ర్యాలీకి డౌటే

సారాంశం

తెలంగాణ సీఎ: కేసీఆర్‌కు పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ  శుక్రవారం నాడు ఫోన్ చేశారు. రేపు బెంగాల్‌లో నిర్వహించే  సమావేశం గురించి చర్చించినట్టు సమాచారం.


హైదరాబాద్:  తెలంగాణ సీఎ: కేసీఆర్‌కు పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ  శుక్రవారం నాడు ఫోన్ చేశారు. రేపు బెంగాల్‌లో నిర్వహించే  ర్యాలీ గురించి చర్చించినట్టు సమాచారం.మరో వైపు ఈ ర్యాలీకి కేసీఆర్ దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది

బీజేపీయేతర పార్టీలతో కలిసి బెంగాల్ సీఎం మమత బెనర్జీ యునైటెడ్  ఇండియా పేరుతో   బెంగాల్ సీఎం  రేపు ర్యాలీని నిర్వహిస్తున్నారు.ఈ ర్యాలీకి   హాజరుకావాల్సిందిగా కేసీఆర్ ను శుక్రవారం నాడు మమత ఫోన్‌లో ఆహ్వానించారు. ఇప్పటికే దేశంలోని బీజేపీయేతర పార్టీలు, సీఎంలను ఈ ర్యాలీకి హాజరుకావాల్సిందిగా  మమత ఆహ్వానాలు పంపారు.

మరో వైపు కేసీఆర్‌కు పంపిన ఆహ్వానం సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దూరంగా మరో ఫ్రంట్‌ ఏర్పాటుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే  ఈ ర్యాలీకి తాను దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు  కేసీఆర్   మమతకు చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడ హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కూడ ఈ  ర్యాలీలో పాల్గొంటానని ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కూడ ఈ ర్యాలీలో పాల్గొంటున్న కారణంగా కేసీఆర్ దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్