సీబీఐ విచారణలో వాస్తవాలు తేలుతాయి: ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై ఎమ్మెల్యే రఘునందన్ రావు

By narsimha lode  |  First Published Feb 6, 2023, 2:20 PM IST

 ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసును సీబీఐ విచారిస్తే వాస్తవాలు వయటకు వస్తాయని  బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు  చెప్పారు. 
 


హైదరాబాద్: ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసులో సీబీఐ దర్యాప్తులో  వాస్తవాలు వెలుగు చూస్తాయని  బీజేపీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు  చెప్పారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల  ప్రలోభాల కేసుపై సీబీఐ విచారణపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్  సోమవారం నాడు కీలక తీర్పును ఇచ్చింది.  సింగిల్  బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్ధించింది.   ఈ విషయమై  ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ లో  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  మీడియాతో మాట్లాడారు.  

Latest Videos

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో  సిట్ ను తెలంగాణ రాష్ట్రప్రభుత్వం తనకు అనుకూలంగా వాడుకుందన్నారు. తప్పు చేయకపోతే  భయం ఎందుకని  ఆయన  బీఆర్ఎస్ ను ప్రశ్నించారు.  ధైర్యంగా సీబీఐ విచారణను ఎదుర్కోవాలని  రఘునందన్ రావు  కోరారు. 

2022 అక్టోబర్  26వ తేదీన  మొయినాబాద్ ఫాంహౌస్ లో  నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు గురిచేశారని కేసు నమోదైంది.  అచ్చంపేట, కొల్లాపూర్,  పినపాక,  తాండూరు ఎమ్మెల్యేలు   గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి,  రేగా కాంతారావు,  పైలెట్ రోహిత్ రెడ్డిలను  ప్రలోభాలకు గురి చేశారని కేసు నమోదైంది.  రామచంద్రభారతి,  సింహయాజీ,  నందకుమార్ లు  నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేశారని  కేసు నమోదైంది.  

 ఈ కేసు విచారణను తెలంగాణ ప్రభుత్వం సిట్   ను ఏర్పాటు  చేసింది.  సిట్ విచారణను  బీజేపీ సహ  ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు తవ్రంగా  వ్యతిరేకించాు. ఈ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని  కోరుతూ  పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై విచారణ నిర్వహించిన  తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్  గత ఏడాది డిసెంబర్  26న  సీబీఐ విచారణకు  ఆదేశించింది.  ఈ  ఆదేశాలను  తెలంగాణ ప్రభుత్వం  గత నెల  3వ తేదీన డివిజన్ బెంచ్ లో  సవాల్  చేసిన విషయం తెలిసిందే. 
 

click me!