ఊళ్లో పరువు పోయింది, హేళన చేస్తున్నారు: కంటి వెలుగు బాధిత దంపతులు

By pratap reddyFirst Published Aug 24, 2018, 7:57 AM IST
Highlights

పత్రికల వాణిజ్య ప్రకటనలో దంపతుల ఫొటోను మార్ఫింగ్‌ చేయడం వల్ల మనోవేదనకు గురైన కుటుంబానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెంటనే క్షమాపణ చెప్పాలని నేత మల్లుభట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌: పత్రికల వాణిజ్య ప్రకటనలో దంపతుల ఫొటోను మార్ఫింగ్‌ చేయడం వల్ల మనోవేదనకు గురైన కుటుంబానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వెంటనే క్షమాపణ చెప్పాలని నేత మల్లుభట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి 3 ఎకరాల భూమితోపాటు డబు ల్‌ బెడ్‌రూం ఇల్లు ఇచ్చి తప్పును సరిదిద్దుకోవాలని ఆయన సూచించారు. 

గాంధీభవన్‌లో గురువారం మీడియా సమావేశానికి బాధితులైన చిన నాగరాజు, పద్మ దంపతులను తీసుకొచ్చారు. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లుగా ప్రభుత్వం భ్రమలు కల్పిస్తోందని మల్లుభట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. ప్రచార ప్రకటనల్లో కోదాడ మండలం తోగుర్రాయికి చెందిన నాగరాజు, పద్మ దంపతుల ఫొటోలను వాడుకున్న తీరే ఇందుకు సాక్ష్యమని అన్నారు. 

పథకాల ప్రచారం కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏ స్థాయికైనా దిగజారుతుందో చెప్పడానికి ఇది నిదర్శనమని, మహిళల పట్ల ఎంత మర్యాదగా ఉందో తెలుస్తోందని మాజీ మంత్రి డీకే అరుణ, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి వ్యాఖ్యానించారు.
 
రుణాలు వస్తాయని చెప్పి రెండేళ్ల కిందట తమ ఫొటోలు తీసుకున్నారని బాధితురాలు పద్మ తెలిపింది. కంటి వెలుగు ప్రకటనలో తన భర్త స్థానంలో మరో వ్యక్తి ఫొటో పెట్టడంతో గ్రామంలో పరువు పోయిందని చెప్పింది. 

గుడుంబా దరిద్రాన్ని వదుల్చుకున్నానంటూ ప్రకటనల్లో తన ఫొటో చూసి అందరూ హేళన చేశారని బాధితుడు నాగరాజు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అధికారుల నిర్వాకం: భర్తను మార్చిన అధికారులు, సంసారంలో చిచ్చు(వీడియో)

కంటి వెలుగులో మారిన భర్త: ఏజెన్సీలకు నోటీసులు జారీ

click me!