జేసీ దివాకర్ రెడ్డిని మేం నిలదీశాం: మల్లుభట్టి విక్రమార్క వివరణ

By telugu teamFirst Published Mar 17, 2021, 7:08 PM IST
Highlights

తెలంగాణ ఏర్పాటు విషయంలోనూ, అందులో సోనియా గాంధీ పాత్ర విషయంలోనూ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్లుభట్టి విక్రమార్క వివరణ ఇచ్చారు. జేసీ దివాకర్ రెడ్డిని తాము నిలదీసినట్లు మల్లుభట్టి విక్రమార్క తెలిపారు.

హైదరాబాద్: తమ పార్టీ అధినేత సోనియా గాంధీపై టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెసు శాసనసభా పక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. జేసీ దివాకర్ రెడ్డి మంగళవారంనాడు తెలంగాణ శాసనసభ ఆవరణకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయాల్లో సోనియా గాంధీ పాత్రపైన, రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్ తదితర విషయాలమీద వివాదస్పదమైన, బాధకరమైన చేశారని ఆయన అన్నారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

జె.సి.దివాకర్ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యాలను తమ శాసన మండలి సభ్యుడు జీవన్ రెడ్డి,  శాసనసభ్యులు డి.శ్రీధర్ బాబు,  కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో కలిసి మిడియా ముందు తీవ్రంగా ఖండించినట్లు తెలిపారు..

ఈ సందర్భంగా తాము సదరు మిడియా ప్రతినిధుల సమక్షంలో జె.సి.దివాకర్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ  “దశాబ్ధదాలు పాటు కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక ఉన్నతి పదవులు అనుభవించారు. మీ రాజకీయ స్వార్ధం కోసం పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీని వదిలి తెలుగుదేశం లో చేరారు” అని అన్నట్లు తెలిపారు. వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆనేది తెలంగాణ ప్రాంత ప్రజల దశాబ్ధాల అకాంక్ష అని, ఆమేరకు ఇక్కడ ప్రజల మనోభావాలను గుర్తిస్తూ రాజకీయ ప్రయోజానాలను కూడ అశించకుండా సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు. ఆ విధంగా సోనియా గాంధీ తెలంగాణ ప్రజల అకాంక్షను నెరవేర్చారని చెప్పారు.

తెలంగాణా ప్రాంత ప్రజల మనోభావాలను సోనియా గాంధీ మన్నిస్తూ తీసుకున్న నిర్ణయం ఏ విధంగా తప్పుపడతారని జె.సి.దివాకర్ రెడ్డి తాము నిలదీశామని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.  అదే విధంగా భవిష్యత్ లో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఘన విజయం సాధించడం ఖామమని ధీమాగా చెప్పినట్లు తెలిపారు.  రాజకీయ అవకాశ విధానాలతో పార్టీ మారడం కారణంగా మీరు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోవడమే కాకుండా మీవంటి రాజకీయ అవకాశవాదులకు  రాజకీయ అశ్రయాన్ని ఇచ్చిన పార్టీలు ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురై భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని తాము జెసి దివాకర్ రెడ్డితో అన్నట్లు ఆయన తెలిపారు

శ్రీ జె.సి.దివాకర్ రెడ్డి అనుచిత వాఖ్యాలకు మిడియా వారు ప్రధాన్యతను ఇచ్చి ప్రచురించడం లేదా ప్రసారం చేయడం జరిగిందే తప్ప ఆయన వాఖ్యలకు ప్రతిగా తాము చేసిన వాఖ్యల ప్రసారం లేదా ప్రచురణకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!