రంగారెడ్డి జిల్లాలో పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య.. అదే కారణమా..?

Published : Jun 10, 2023, 10:52 AM IST
రంగారెడ్డి జిల్లాలో పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్య.. అదే కారణమా..?

సారాంశం

రంగారెడ్డి జిల్లా యాచారంలో ఓ పోలీసు కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

రంగారెడ్డి జిల్లా యాచారంలో ఓ పోలీసు కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం అతడు మల్కాజ్‌గిరి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే తల వెంట్రుకలు ఊడిపోవడం, అనారోగ్య సమస్యల కారణంగానే అతడు ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. వివరాలు.. యాచారం మండలం గడ్డమల్లాయగూడ గ్రామానికి చెందిన ఆర్ల బుచ్చయ్య, మణెమ్మల కుమారుడు వినోద్. వినోద్ ప్రస్తుతం మల్కాజ్‌గిరి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే వినోద్ కొన్నేళ్లుగా చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. 

Also Read: రైలు పట్టాలపై జహీరాబాద్ బీఆర్ఎస్ నేత మృతదేహాం.. అసలేం జరిగిందంటే..

అంతేకాకుండా ఇటీవల ఇతర అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మందులు వాడినప్పటికీ ఫలితం లేకుండా పోయినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే కొన్ని వారాలుగా విధులకు దూరంగా ఉంటున్న వినోద్ శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మల్కాజిగిరి పోలీసు స్టేషన్ సిబ్బంది మాట్లాడుతూ మంచి ఉద్యోగిని కోల్పోయామని అన్నారు.

(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!