బండి సంజయ్‌కి మైనంపల్లి హన్మంతరావు సవాల్: నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా

By narsimha lodeFirst Published Aug 19, 2021, 12:48 PM IST
Highlights

బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ కు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గురువారం నాడు సవాల్.విసిరారు.  సంజయ్ అరాచకాలను ఆధారాలతో సహా బయటపెడతానని ఆయన ప్రకటించారు. దళితులపై దాడి చేసిన సమయంలో తాను ఇంట్లోనే లేనని ఆయన చెప్పారు. ఒకవేళ తాను ఇంట్లో ఉన్నట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు.


హైదరాబాద్: బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ వ్యవహరం త్వరలోనే ఆధారాలతో బయటపెడతానని  మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చెప్పారు.గురువారం నాడు ఆయన హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.  బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు మైనంపల్లి హన్మంతరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. దళితులపై దాడి చేశారని కూడ ఆయనపై కేసు నమోదైంది.ఈ విషయమై ఆయన స్పందించారు. ఎంపీ పదవి నుండి బండి సంజయ్ నుండి దింపేవరకు తాను వెంటపడతానని ఆయన  చెప్పారు.

 దళితులపై దాడి అని తనపై తప్పుడు ప్రచారం చేశారని  ఆయన చెప్పారు. ఆ ఘటన జరిగిన సమయంలో తాను ఇంట్లో కూడా లేనని ఆయన చెప్పారు. తాను ఇంట్లో ఉన్నట్టుగా నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు.బండి సంజయ్ ఏం చేస్తున్నాడో అన్ని ఆధారాలతో సహా త్వరలోనే నిరూపిస్తానని ఆయన చెప్పారు.

స్వాతంత్ర్య దినోత్సవం రోజున టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది.ఆ తర్వాత ఈ రెండు పార్టీల మధ్య వరుసగా ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. ఈ విషయమై బీజేపీ చీఫ్ బండి సంజయ్, మైనంపల్లి హన్మంతరావు మధ్య మాటల యుద్దం సాగుతోంది.  టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు పరస్పరం కేసులు పెట్టుకొన్నారు. 

click me!