అనుమానం : వేరేవాళ్లతో ఫోన్ లో మాట్లాడుతుందని.. భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త.. !

Published : Aug 19, 2021, 12:09 PM IST
అనుమానం : వేరేవాళ్లతో ఫోన్ లో మాట్లాడుతుందని.. భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త.. !

సారాంశం

మేకవేలు రాయి కొట్టే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య ఇతరులతో ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై తరచు ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. 

హైదరాబాద్ : వేరే వాళ్లతో ఫోన్ లో మాట్లాడుతుందని అనుమనం పెంచుకున్న భర్త, భార్యను సుత్తితో తలమీద కొట్టి హత్య చేసిన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

సీఐ వేణుగోపాల్ రెడ్డి, క్రైం సీఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని చిట్కుల్ వడ్డెర కాలనీకి చెందిన రాజేశ్వరి (23)కి మూడు సంవత్సరాల క్రితం మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని వెంకటరావు పేట గ్రామానికి చెందిన మేక వేలుతో వివాహం జరిగింది. పెళ్లి తరువాత చిట్కుల్ లోని వడ్డెరకాలనీలోనే కాపురం పెట్టారు. 

రెండున్నరేళ్ల కుమారుడు రాజేష్ ఉన్నాడు. మేకవేలు రాయి కొట్టే పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్య ఇతరులతో ఎక్కువగా ఫోన్లు మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై తరచు ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి.  16వ తేదీన కూడా ఇద్దరు గొడవ పడగా, కుటుంబసభ్యులు సర్దిచెప్పారు. 

మనసులో కక్ష పెట్టుకున్న మేక వేలు బుధవారం ఉదయం రాళ్లు కొట్టేందుకు ఉపయోగించే సుత్తితో భార్య రాజేశ్వరి తలమీద గట్టిగా కొట్టాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయగా, మేకవేలు ఇంటి నుంచి పరారయ్యాడు. 

చుట్టుపక్కలవారు, కుటుంబసభ్యులు గమనించి పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రిక తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని డాక్టర్లు చెప్పారు. మృతదేహానికి పోస్ట్ మార్టమ్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, భార్యను హత్య చేసిన మేకవేలు పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Kavitha Comments: అలా చేస్తేనే మహిళలల రిజర్వేషన్ బిల్ వచ్చే ఆస్కారం | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లుపై BJP Bandaru Vijayalakshmi Reaction | Telangana | Asianet News Telugu