
తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గవర్న ర్ ఇఎస్ఎల్ నరసింహన్ తో తరచూ సమావేశం కావడం పట్ల కాంగ్రెస్ వర్గాల్లో అనుమానాలు మొదలయ్యాయి. గతంలోఎపుడు ఏ ముఖ్యమంత్రి కూడా కలవనంతగా కెసిఆర్ గవర్నర్ ని కలుస్తున్నారు. తెలంగాణ ఉద్యమంనాడు చూపిన వైరం ఎంs తీవ్రంగా ఉండిందో ఇపుడు గవర్నర్ కు ముఖ్యమంత్రికి మధ్య ఈ మధ్య సాన్నిహిత్యం కూడా అంతే ఎక్కువయింది. గవర్నర్ కు పాదిభివందనం చేసి ముఖ్యమంత్రి ఆయన ఆశీస్సులను కూడా తీసుకుంటున్నారు. దాదాపు వారానికో పదిరోజులకో ముఖ్యమంత్రి గవర్నర్ ను కలవడం రివాజయింది.అంతేకాదు, ఆయన మొత్తం క్యాబినెట్ నంతటిని తీసుకుని రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ కు 70 జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
గవర్నర్ ముఖ్యమంత్రి సమావేశాల్లో ఏంజరుగుతున్నదో, ఏ మాట్లాడుతున్నారో వెల్లడించాలని కాంగ్రెస్ నాయకుడు, మాజీ లోక్ సభ సభ్యుడు పొన్నంప్రభాకర్ అడుగుతున్నారు.
’సీఎం , గవర్నర్ తో భేటీల పై ప్రజలకు చెప్పాలి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నల్లధనం పై కేసీఆర్ గవర్నర్ త్ చర్చించారని ప్రజలు అనుకుంటున్నారు. అందువల్ల గురువారం నాటి సమావేశంలో ఏమిజరిగిందో చెప్పాలి,’ ప్రభాకర్ ఈ రోజు డిమాండ్ చేశారు.
’ రాజ్ భవన్ సమావేశాలు కేసీఆర్ వ్యక్తిగతం కాదు. ఈ భేటీల రహష్య ఏజెండా ఏమిటో బహిరంగ పర్చాలి. మిషన్ కాకతీయ పేరుతో కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఉపాధిని చేశారు. 48000 చెరువుల్లో పనులు ప్రారంభించినవి 10 వేల చేరువులే. మిషన్ కాకతీయ 100 శాతం సక్సెస్ అయ్యిందని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ హయాంలో జరిగిన పనులను టీఆరెస్ ఖాతాలో వేసుకుంటున్నారు. మిషన్ కాకతీయ పై ప్రభుత్వం శ్వేతా పత్రం ఇవ్వాలి,’ అని పొన్నం అరోపించారు. ఈ విషయంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ బహిరంగ చర్చకు సిద్ధమా అని పొన్నం ప్రశించారు.