విద్యార్థి ప్రాణం మీదకు తెచ్చిన అద్దం.. పరిస్థితి విషమం

By ramya neerukondaFirst Published Sep 21, 2018, 12:43 PM IST
Highlights

నరేష్‌ రోజువారి లాగానే తాను ఆరేసిన బట్టలను తీసుకోవాడానికి అద్దాల బీరువాను ఎక్కడంతో ఒక్కసారిగా అద్దం పగిలి నరేష్‌ కుడిచేతికి కుచ్చుకుంది. 

అద్దం ఓ విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. వసతి గృహంలో ఉతికి ఆరేసుకున్న బట్టలను తెచ్చుకునేందుకు ప్రయత్నించిన ఓ కుర్రాడికి చేదు అనుభం ఎదురైంది. అద్దం బాలుడి చేతిలోకి దిగింది. ఈ సంఘటన సూర్యాపేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...నాగారం మండలంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలను చివ్వెంల మండల కేంద్ర సమీపంలోని దీవెన ఫార్మసీ కళాశాలలో నిర్వహిస్తున్నారు. మఠంపల్లి గ్రామానికి చెందిన నరేష్‌ వసతి గృహంలో ఉంటూ 6వతరగతి చదువుతున్నాడు. ఈ నేపథ్యంలో హస్టల్‌ గదిలో ఉన్న అద్దాల బీరువాలు ఖాళీగా పడి ఉన్నాయి. దీంతో విద్యార్థులు వాటిపై తమ దుస్తులను ఆరేసుకుంటున్నారు. నరేష్‌ రోజువారి లాగానే తాను ఆరేసిన బట్టలను తీసుకోవాడానికి అద్దాల బీరువాను ఎక్కడంతో ఒక్కసారిగా అద్దం పగిలి నరేష్‌ కుడిచేతికి కుచ్చుకుంది. 

దీంతో నరేష్‌ చేతి నరం తెగి తీవ్ర రక్తస్రావం కావడంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైద్రాబాద్‌లోని ఓ కార్పోరేట్‌ హస్పిటల్‌లో వెనీషియా సంస్థ ఆధ్వర్యంలో ఆ పాఠశాలల కమిషనర్‌ ఆదేశాల మేరకు మెరుగైన చికిత్స అందిస్థున్నట్లు ఆ పాఠశాలల జిల్లా కన్వీనర్‌ మాధవరెడ్డి తెలిపారు. గతంలో ఇలాంటి ఘటనలపై సిబ్బంది ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి.

 సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిన తప్పును సరిదిద్దుకోవాలని విద్యార్థి తల్లితండ్రులకు తెలియకుండా గోప్యంగా ఉంచారని, పరిస్థితి విషమంగా ఉండడంతో చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలు విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కలెక్టర్‌ సురేంద్రమోహన్‌ ఆరా తీసి వివరణ కోరినట్లు విశ్వసనీయ సమాచారం.

click me!
Last Updated Sep 21, 2018, 12:43 PM IST
click me!