నగర బహిష్కారంపై హైకోర్టు మెట్లెక్కిన మహేష్ కత్తి

First Published Jul 25, 2018, 9:03 PM IST
Highlights

హైదరాబాదు నగరం నుంచి తనను బహిష్కరిస్తూ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై సినీ క్రిటిక్ మహేష్ కత్తి హైకోర్టు తలుపులు తట్టారు. పిటిషన్‌ను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు విచారణ చేపట్టింది.

హైదరాబాద్: హైదరాబాదు నగరం నుంచి తనను బహిష్కరిస్తూ పోలీసులు తీసుకున్న నిర్ణయంపై సినీ క్రిటిక్ మహేష్ కత్తి హైకోర్టు తలుపులు తట్టారు. పిటిషన్‌ను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు విచారణ చేపట్టింది. నగర బహిష్కరణపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి కోర్టు మూడు వారాల పాటు గడువు ఇచ్చింది.
 
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణపై కత్తి మహేష్‌ను నగర బహిష్కరణ చేస్తూ హైదరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అలాగే నిరుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పరిపూర్ణనంద స్వామిని కూడా ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. 

పరిపూర్ణానందను బహిష్కరించడాన్ని బిజెపి తప్పు పట్టింది. ఆ తర్వాత పరిపూర్ణనంద స్వామి కూడా హైకోర్టును ఆశ్రయించి బహిష్కరణను ఎత్తేయాలని కోరారు. 

click me!