కందుకూరు:  బాలికను స్వంత వదినే వ్యభిచార గృహానికి అమ్మేసింది.  విటుల వేదింపులు భరించలేక ఆమె పోలీసులను  ఆశ్రయించింది.

నెల్లూరు  జిల్లా కావలి పట్టణానికి చెందిన పదో తరగతి చదివిన బాలిక ఇంటి వద్దే ఉంటోంది.తల్లిదండ్రుల  మధ్య సఖ్యత  లేదు. దీంతో ఆమె తన సోదరుడి ఇంటి వద్ద ఉంటుంది.  అయితే  సోదరుడి భార్య ఆ బాలికను విక్రయించింది.

ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన మహిళకు ఈ ఏడాది జూలైలో విక్రయించింది.  ఈ బాలికను కొనుగోలు చేసిన మహిళ  బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తోంది. ఈ నరక కూపం నుండి తప్పించుకొన్న బాలిక పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు గతంలోనే నలుగురు వ్యభిచార నిర్వాహకులను అరెస్ట్ చేశారు.

ఈ కేసు విచారణను ఒంగోలు దిశ డిఎస్పీని చేపట్టనున్నారు. బాలికతో వ్యభించారం చేసిన తొమ్మిది  మంది విటుల వివరాలను సేకరించారు.విటులు బ్యాంకు లావాదేవీల సహాయంతో ప్రాథమికంగా గుర్తించారు. వీరిని వివిధ ప్రాంతాల్లో అరెస్ట్ చేశారు.