హైద్రాబాద్‌లో మహేష్ బ్యాంకుపై సైబర్ ఎటాక్: రూ. 12 కోట్లు హాంఫట్

Published : Jan 24, 2022, 07:03 PM IST
హైద్రాబాద్‌లో మహేష్ బ్యాంకుపై సైబర్ ఎటాక్: రూ. 12 కోట్లు హాంఫట్

సారాంశం

హైద్రాబాద్‌లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంకుపై సైబర్ దాడి జరిగింది.ఈ దాడిలో రూ. 12 కోట్లను నేరగాళ్లు 120 ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఈ విషయమై బ్యాంకు యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

హైదరాబాద్:  హైద్రాబాద్ నగరంలోని మహేష్ కో ఆపరేటివ్ బ్యాంక్ పై సైబర్ ఎటాక్ జరిగింది. బ్యాంక్ నుండి రూ. 12 కోట్లను Cyber నేరగాళ్లు కొట్టేశారు. ఈ విషయమై బ్యాంకు యాజమాన్యం పోలీసులకు సోమవారం నాడు ఫిర్యాదు చేసింది.

బ్యాంకు server ను హ్యాక్ చేసి రూ. 12 కోట్లను కొట్టేశారు దుండగులు. ఈ బ్యాంకు నుండి కొట్టేసిన  నగదును 120 బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించారని సైబర్ క్రైమ్ పోలీసులకు మMahesh Bank ఫిర్యాదు చేసింది. Bank సర్వర్ ను  సైబర్ నేరగాళ్లు ఎలా హ్యాక్ చేశారనే విషయమై  సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu