మహారాష్ట్ర చేరిన కవిత హెల్మెట్ ప్రోగ్రాం

Published : Aug 07, 2017, 07:39 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
మహారాష్ట్ర చేరిన కవిత హెల్మెట్ ప్రోగ్రాం

సారాంశం

సిస్టర్ ఫర్ చేంజ్ పోస్టర్ ఆవిష్కరించిన మహారాష్ట్ర గవర్నర్  దేశమంతా పాకిన కవిత హెల్మెట్ ప్రోగ్రాం

నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రారంభించిన సిస్టర్స్ ఫర్ చేంజ్ క్యాంపెయిన్ దేశం నలుమూలలా వ్యాపించింది. హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడు కోవాల్సిందిగా కోరుతూ ఎంపీ కవిత మొదలు పెట్టిన ఈ ప్రచారంలో అన్నకు హెల్మెట్ రక్ష అనే నినాదంతో రాఖీ కట్టిన సోదరులకు చెళ్లెలు, అక్కలు హెల్మెట్ బహూకరించాలని కోరారు.

కాగా ఇప్పటికే చాలామంది ప్రముఖులు స్పందించగా నేడు మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు ముంబయిలోని రాజ్ భవన్ లో రాఖీ సంబరాల్లో  సిస్టర్స్ ఫర్ చేంజ్ క్యంపెయిన్ పోస్టర్ ఆవిష్కరించారు.

హెల్మెట్ లేనందువల్ల రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య  ప్రతీయేడు పెరుగుతుందనీ లక్షల కుటుంబాల్లో విషాదం నెలకొంటుందని అన్నారు. హెల్మెట్ వాడడం తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుల్గే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం