టీఆర్ఎస్ లోకి మొదలైన జంప్ జిలానీలు

By ramya neerukondaFirst Published Dec 13, 2018, 11:53 AM IST
Highlights

మహాకూటమి తరుపున గెలుపొందిన కొందరు నేతలు.. అధికార పార్టీలోకి జంప్ చేసేందుకు సిద్ధమైపోయారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని  మహాకూటమి తరపున గెలిచిన అభ్యర్థులు ఎప్పుడెప్పుడు టీఆర్ఎస్ లో చేరిపోదామా అని ఎదురుచూస్తున్నారట. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించింది. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన మంత్రి వర్గంలో ఎవరెవరికి చోటు కల్పిస్తారో కూడా ఇంకా క్లారిటీ లేదు. గెలిచిన అభ్యర్థులు ఇంకా అసెంబ్లీలోకి అడుగుకూడా పెట్టలేదు. కాగా.. అప్పుడే పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి.

మహాకూటమి తరుపున గెలుపొందిన కొందరు నేతలు.. అధికార పార్టీలోకి జంప్ చేసేందుకు సిద్ధమైపోయారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని  మహాకూటమి తరపున గెలిచిన అభ్యర్థులు ఎప్పుడెప్పుడు టీఆర్ఎస్ లో చేరిపోదామా అని ఎదురుచూస్తున్నారట. తెలంగాణ వ్యాప్తంగా.. కేవలం ఖమ్మం జిల్లాలో మాత్రం మహాకూటమి తన ప్రాభల్యాన్ని చూపించగలిగింది.

ప్రజాకూటమి అభ్యర్థుల్లో 8మంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలుపొందారు. వారిలో కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, పినపాక, మధిర, పాలేరుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు.. అశ్వారావుపేట, సత్తుపల్లిలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. సీపీఐ కి కేటాయించిన వైరాలో స్వతంత్ర అభ్యర్థి గెలవగా.. టీఆర్ఎస్ ఖమ్మం సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోని కీలకనేతలంతా ఓటమిపాలవ్వడంతో.. గెలిచిన నేతలంతా ఆత్మరక్షణలో పడిపోయారట. ఒకరిద్దరూ మినహాయించి.. అందరి చూపు టీఆర్ఎస్ వైపే ఉందని తెలుస్తోంది. కేసీఆర్ ఊ.. అంటే.. ఆ పార్టీ కండువా కప్పుకోవాలని చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

click me!