కేసీఆర్ గరం, కఠినమే: ఆ ముగ్గురిపై వేటు ఖాయం

By Nagaraju TFirst Published Dec 13, 2018, 11:27 AM IST
Highlights

తెలంగాణ ముందస్తు ఎన్నికల ఫలితాలతో మాంచి జోష్ లో ఉన్న టీఆర్ఎస్...పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా 88  స్థానాలను కైవసం చేసుకుని రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యబోతున్నారు సీఎం కేసీఆర్. 
 

హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల ఫలితాలతో మాంచి జోష్ లో ఉన్న టీఆర్ఎస్...పార్టీ ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది. తెలంగాణలో ఎవరూ ఊహించని విధంగా 88  స్థానాలను కైవసం చేసుకుని రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యబోతున్నారు సీఎం కేసీఆర్. 

ఈ నేపథ్యంలో తమ పార్టీ తరపున ఎమ్మెల్సీలుగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన ముగ్గురు ఎమ్మెల్సీలపై వేటు వేసేందుకు రెడీ అయ్యింది. ముందస్తు ఎన్నికల్లో ఎమ్మెల్సీలు యాదవ్ రెడ్డి,భూపతిరెడ్డి, రాములు నాయక్ లు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డిని పార్టీ నుంచి శాశ్వత బహిష్కరణ వేటు వేసింది టీఆర్ఎస్. అలాగే రాములు నాయక్, భూపతి రెడ్డిపై కూడా టీఆర్ఎస్ పార్టీ వేటు శాశ్వత బహిష్కరణ వేటు వేసింది. 

యాదవరెడ్డి, రాములు నాయక్, భూపతిరెడ్డిల శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చెయ్యాలని టీఆర్ఎస్ పార్టీ శాసన మండలి చైర్మన్ కు ఫిర్యాదు చెయ్యనుంది. మరికాసేపట్లో టీఆర్ఎస్ నేతలు శాసనమండలి చైర్మన్ ను కలిసి ముగ్గురిపై ఫిర్యాదు చెయ్యనున్నారు. 

ఇకపోతే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్సీలను తమ పదవులకు రిజైన్ చెయ్యాలంటూ టీఆర్ఎస్ అధిష్టానం ఆదేశించింది. ఈ నేపథ్యంలో మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. మరికాసేపట్లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ కు తమ రాజీనామాలను అందజేయనున్నారు. 
 

click me!