మహబూబాబాద్‌లో నిత్య పెళ్లి కూతురు.. ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు.. అలా అనుమానం రావడంతో..!

Published : Jun 22, 2022, 10:41 AM ISTUpdated : Jun 22, 2022, 10:56 AM IST
మహబూబాబాద్‌లో నిత్య పెళ్లి  కూతురు.. ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు.. అలా అనుమానం రావడంతో..!

సారాంశం

తెలంగాణలోని మహబూబాబాద్‌లో ఓ నిత్య పెళ్లి  కూతురు బండారం బయటపడింది. ఆమె గురించి తెలుసుకుని అంతా షాక్ తిన్నారు. ఎందుకంటే.. ఆమె రెండు కాదు, మూడు కాదు.. ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుంది. ఆ నిత్య పెళ్లికూతురు చిట్టాను తొమ్మిదో భర్త బయటపెట్టాడు.

తెలంగాణలోని మహబూబాబాద్‌లో ఓ నిత్య పెళ్లి  కూతురు బండారం బయటపడింది. ఆమె గురించి తెలుసుకుని అంతా షాక్ తిన్నారు. ఎందుకంటే.. ఆమె రెండు కాదు, మూడు కాదు.. ఏకంగా తొమ్మిది పెళ్లిళ్లు చేసుకుంది. ఆ నిత్య పెళ్లికూతురు చిట్టాను తొమ్మిదో భర్త బయటపెట్టాడు. తనకు విడాకులు ఇవ్వాలని కోరాడు. అయితే ఆ మహిళ భర్తకు విడాకులు ఇవ్వకుండా.. అతడిపైనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించింది. మరి ఆ మహిళ తొమ్మిది పెళ్లిళ్ల సంగతేమిటో ఒకసారి చూద్దాం..
 
మహబూబాబాద్ జిల్లా మహిళకు.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గంపలగూడెంకు చెందిన  వ్యక్తితో మ్యాట్రిమోని వెబ్‌సైట్​లో పరిచయమైంది. ఆ పరిచయం పెళ్లికి దారితీసింది. మూడేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. బెంగళూరులో ఈ జంట కాపురం పెట్టింది. పెళ్లి జరిగిన తర్వాత కొన్ని నెలల పాటు మాత్రమే వీరు కలిసి ఉన్నారు. అయితే మహిళ తరచూ ఫోన్​లో కోర్టు విషయాల గురించి మాట్లాడుతూ ఉండేదని ఆమె భర్త చెప్పాడు. ఏంటని అతను ప్రశ్నిస్తే గొడవకు దిగేదని తెలిపాడు. ఇలా నడుస్తున్న ఆమె అకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్లిందని.. తిరిగి వెళ్లి వచ్చాకా మరోసారి హైదరాబాద్ వెళ్తానని అనడంతో ​ అనుమానంతో ఆరా తీసినట్టుగా మహిళ భర్త చెబుతున్నాడు. 

ఈ క్రమంలోనే ఆమె తన కంటే ముందు ఎనిమిది మందిని పెళ్లి చేసుకున్నట్టుగా అతడు గుర్తించాడు. ఆమెతో కలిసి జీవించలేనని భావించి విడాకులు కోరారని తెలిపాడు. అయితే అందుకు ఆమె ఒప్పుకోలేదని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆ మహిళ.. భర్త నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్తే నిత్య పెళ్లికొడుకు అని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని మహబూబాబాద్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. ఈ విషయం తెలుసుకున్న మహిళ భర్త.. అతడు సేకరించిన ఆధారాలను పోలీసుల ముందు ఉంచాడు. ఈ క్రమంలోనే పోలీసులు ఇద్దరి ఫిర్యాదులపై విచారణ చేపట్టారు. 
 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే