Agneepath Protest In Secunderabad కీలక ఆధారాలు సేకరణ: నేడు ఆవుల సుబ్బారావు విచారణ

By narsimha lode  |  First Published Jun 22, 2022, 10:21 AM IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి సంబంధించి సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన ఆవుల సుబ్బారావును రైల్వే సిట్ బృందం ఇవాళ విచారించనుంది.  మరో వైపు ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీకి చెందిన  కొందరు ఈ విధ్వంసం వెనుక ప్లాన్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ విషయమై పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. 
 


హైదరాబాద్: Secunderabad రైల్వే స్టేషన్ లో విధ్వంసం పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందని దర్యాప్తు బృందం చెబుతుంది. అయితే ఈ పథక రచన ఎవరు చేశారనే విషయమై SIT బృందం విచారణ చేస్తుంది. అయితే ఈ విధ్వంసం వెనుక ప్రైవేట్ Defence  కోచింగ్ అకాడమీల పాత్ర ఉందని రైల్వే ఎస్పీ అనురాధ ప్రకటించారు. ప్రైవేట్ డిఫెన్స్ కోచింగ్ అకాడమీలకు చెందిన వారెవరు  ఈ  విధ్వంసం వెనుక ఉన్నారనే విషయమై సిట్ దర్యాప్తు చేస్తుంది. 

Andhra Pradesh  రాష్ట్రంలోని ఉమ్మడి Guntur  జిల్లాలోని Narsaraopet కు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన  ఆవుల సుబ్బారావును Telangana కు చెందిన Task Force పోలీసులు మంగళవారం నాడు రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా నుండి నుండి Hyderabad కు తీసుకు వచ్చిన తర్వాత  ఆవుల సుబ్బారావును టాస్క్ ఫోర్స్ పోలీసులు రైల్వే పోలీసులకు అప్పగించారు.  

Latest Videos

undefined

Avula Subba Rao ను  రైల్వే సిట్ బృందం ఇవాళ విచారించనుంది.  మరో వైపు  సికింద్రాబాద్ రైల్వే స్టేసన్ లో విధ్వంసానికి Whats APP  కీలకంగా పనిచేశాయని కూడా దర్యాప్తు అధికారులు గుర్తించారు.  అయితే సుమారు 10 వాట్సాప్ గ్రూపులను  క్రియేట్ చేసి ఆర్మీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులను రెచ్చగొట్టారని ఇప్పటికే సిట్ బృందం గుర్తించింది. ఇప్పటికే ఒక్క వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరో వైపు మిగిలిన వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. 

ఇదిలా ఉంటే వాట్సాప్ గ్రూపుల ద్వారా ఆర్మీ అభ్యర్ధులను రెచ్చగొట్టేందుకు గాను  ఓ ప్రైవేట్ డిఫెన్స్ కీలకంగా వ్యవహరించిందని దర్యాప్తు అధికారులు గుర్తించారని ప్రముఖ మీడియా సంస్థ ఎబీఎన్ కథనం ప్రసారం చేసింది. విధ్వంసంలో పాల్గొనేందుకు వచ్చిన ఆర్మీ అభ్యర్ధులకు ఒక్క రోజు ముందే భోజనం, వసతిని కూడా కల్పించారని పోలీసులు ఆధారాలను సేకరించారని ఏబీఎన్ కథనంలో తెలిపింది. మరో వైపు తెలంగాణలోని ఉమ్మడి Karimnagar జిల్లాకు చెందిన ఓ ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీకి చెందిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేసే అవకాశం ఉందని  ఈ కథనంలో ప్రసారం చేశారు. 

also read:Agnipath Protest : సికింద్రాబాద్ ఆందోళనలో పాల్గొన్న యువకుడు ఆత్మహత్యాయత్నం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వసంలో పాల్గొన్న వారిలో 56 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇంకా 11 మంది పరారీలో ఉన్నారని రైల్వే ఎస్పీ అనురాధ ఇప్పటికే ప్రకటించారు. మరో వైపు మంగళవారం నాడు మరో 15 మంది అనుమానితులను రైల్వే పోలీసులు ప్రశ్నించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో విధ్వంసానికి పాల్పడిన వారిపై  జరిపిన కాల్పుల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన  దామెర రాకేష్ అనే యువకుడు మరణించాడు. మరో వైపు ఆందోళనలో పాల్గొన్నవారిలో 11 మందికి బుల్లెట్ గాయాలయ్యాయని కూడా రైల్వే పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 

click me!