సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. తాము నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ఆ ఇల్లు మహిళల పేరు మీద ఉంటుందని వివరించారు.
Indiramma Illu Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో హామీని కార్యరూపంలోకి తెచ్చింది. తాజాగా భద్రాచలంలో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రాముడి పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇంటి నిర్వహణ అంతా ఆడవారి చేతిలో ఉండాలని, అలా ఉంటేనే ఇల్లు కళకళలాడుతుందని అన్నారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఇల్లు బాగుంటుందని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరు మీదనే ఉంటాయని సీఎం స్పష్టం చేశారు. తాము నాలుగున్నర లక్షల ఇళ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు.
డబుల్ బెడ్ రూం స్కీం అంటూ కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశాడని ఫైర్ అయ్యారు. దమ్ముంటే ఇందిరమ్మ ఇళ్ల ఉన్న ఊరిలో ఓట్లు అడగొద్దని, తాము డబుల్ బెడ్రూం ఉన్న ఊరిలో ఓట్లు అడగబోమని సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు సిద్ధమేనా? అని బీఆర్ఎస్‌ను అడిగారు.
Also Read: Raghu Rama: నరసాపురం నుంచే రఘురామ పోటీ.. టికెట్ మాత్రం ఈ పార్టీదే
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో నాలుగు పథకాలను అమలు చేసింది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల ఐదో హామీని అమల్లోకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, కొండా సురేఖలు పాల్గొన్నారు.