కలెక్టరమ్మ ప్రీతిమీనా ఏం చేశారో తెలుసా ?

Published : Dec 17, 2017, 02:08 PM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
కలెక్టరమ్మ ప్రీతిమీనా ఏం చేశారో తెలుసా ?

సారాంశం

బాధితుల సేవలో కలెక్టర్ చొరవ  రోడ్డు ప్రమాద బాదితుడికి వైద్యం చేయించిన కలెక్టరమ్మ అభినందిస్తున్న జిల్లా ప్రజలు

మహబూబాబాద్ అంతటా చర్చ

తెలంగాణ డైనమిక్ అధికారుల్లో మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతిమీనా కూడా ఒకరు. ఆమె పరిపాలనను ప్రజల వద్దకే తీసుకెళ్లిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. గతంలో స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని సంచలన ఆరోపణలు చేశారు. శంకర్ నాయక్ చేయి పట్టుకున్నట్లు ఆరోపించారు. దానిపై అప్పట్లో పెద్ద దుమారం రేగింది. ఇదంతా గతం. 

తాజాగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రీతిమీనా ఔదార్యం చూపారు. జిల్లాలోని కురవి మండలం మోగిలిచెర్ల రహదారి వద్ద 60 సం. వ్యక్తి ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు పై పడి గాయలు పాలయ్యాడు. కలెక్టర్ డాక్టర్. ప్రీతిమీనా డోర్నకల్ లో ఒక కార్యక్రమంలో పాల్గొని తిరిగి మహబూబాబాద్ కు వస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదం కలెక్టర్ కంట పడింది. దీంతో కలెక్టర్, వెంటనే తన వాహనాన్ని అపి గాయాపడిన వ్యక్తి ని మానవతా దృపదంతో తన వాహనంలో ఎక్కించుకొని జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు... వెంటనే చికిత్స అందించాల్సిందిగా డాక్టర్ లను ఆదేశించారు.

కలెక్టరమ్మ చేసిన పనిని అందరూ అభినందించారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: కేవలం రూ. 1 కే కడుపు నిండా భోజనం..
KTR Counter to Uttam Kumar Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సెటైర్లు| Asianet News Telugu