
హైదరాబాద్: డే కేర్ సెంటర్ లో తమ పిల్లవాడిని చేర్చిన తల్లిదండ్రులకు విషాదమే మిగిలింది. చావు బతుకుల్లో ఉన్న పిల్లవాడిని డే కేర్ సెంటర్ వాళ్లు తమకు ఇచ్చారని తల్లిదండ్రులు అంటున్నారు.
హైదరాబాద్ మధురానగర్‌లోని లారెల్ ఫ్రీ స్కూల్ సిబ్బంది చేసిన ఈ నిర్వాకాన్ని వారు వివరించారు. "మీ బాబు డే కేర్ సెంటర్ లో టార్పాయింట్ ఆయిల్ తాగాడని , ప్రస్తుతం హాస్పిటల్ లో జాయిన్ చేశాం" అని డే కేర్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు.
దాంతో ఆ రెండేళ్ల వయస్సు గల బాలుడి తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకున్నారు. బాలుడి తల్లిదండ్రులు చెప్పిన వివరాల ప్రకారం... ఆసుపత్రిలో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకొని "కంప్లయింట్ చేయవద్దని , పిల్లోడికి బాగు చేసే బాధ్యత మాది" అని హమీ ఇచ్చారు.
కానీ ఇప్పుడు ఆ బాలుడికి సుమారు 47 లక్షలు ఖర్చు కావడంతో డే కేర్ యాజమాన్యం ఒక్కరూపాయి కుడా ఇవ్వబోమని, ఏం చేసుకుంటారో చేసుకోండని చేతులెతేశారు. దాంతో ఏం చేయాలో దిక్కు తోచని దయనీయ స్థితుల్లో తల్లితండ్రులు మీడియాను ఆశ్రయించారు.