గచ్చిబౌలి పబ్‌లో జరిగింది కల్చరల్ పార్టీ..లిక్కర్ సరఫరా జరగలేదు: మాదాపూర్ డీసీసీ

By Sumanth KanukulaFirst Published Jun 27, 2022, 12:13 PM IST
Highlights

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఓ పబ్‌లో మైనర్లు పార్టీ చేసుకున్న విషయం వెలుగుచూడటంతో  తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పబ్‌లో జరిగిన పార్టీకి సంబంధించిన అనుమతులపై మాదాపూర్ డీసీపీ క్లారిటీ ఇచ్చారు.

హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఓ పబ్‌లో మైనర్లు పార్టీ చేసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఎక్సైజ్ శాఖ పబ్‌లోకి పార్టీకి అనుమతి నిరాకరించినప్పటికీ.. ఓ బడా నేత ప్రమేయంతో పార్టీకి అనుమతి లభించిందని ప్రచారం సాగింది. అయితే పబ్‌లో మైనర్ల పార్టీకి అనుమతించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పబ్‌లో జరిగిన పార్టీకి సంబంధించిన అనుమతులపై మాదాపూర్ డీసీపీ క్లారిటీ ఇచ్చారు. గచ్చిబౌలి పబ్‌లో జరిగింది కల్చరల్ పార్టీ అని చెప్పారు. డ్యాన్స్, మ్యూజిక్‌తో కూడిన పార్టీ మాత్రమే జరిగిందని తెలిపారు. 

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్టీ జరిగిందని మాదాపూర్ డీసీపీ తెలిపారు. పబ్‌లో జరిగిన పార్టీలో ఎక్కడ లిక్కర్ సరఫరా జరగలేదని చెప్పారు. మైనర్స్‌ను పేరెంట్స్‌తో కలిసి అనుమతించారని తెలిపారు. పార్టీకి షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్టుగా వెల్లడించారు.ఈ మేరకు తెలుగు న్యూస్ చానల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో పబ్ కల్చర్ రోజురోజుకు పెరిగిపోతుంది. మైనర్లు కూడా పబ్‌ల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టిన.. పబ్‌ల యజమాన్యాల తీరులో మార్పు రావడం లేదు. ఇటీవల జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్‌లో మైనర్లు పార్టీ చేసుకోవడం.. ఆ తర్వాత జరిగిన దారుణం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే  తాజాగా హైదరాబాద్‌లోని మరో పబ్‌లో మైనర్లు పార్టీ చేసుకున్నట్టుగా వార్తలు రావడం తీవ్ర విమర్శలకు దారితీసింది. 

click me!