హైద్రాబాద్ ఐఐటీ క్యాంపస్ లో ఎంటెక్ చదవుతున్న రాహుల్ అనే విద్యార్ధి బుధవారం నాడుఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్: హైద్రాబాద్ ఐఐటీ క్యాంపస్ లో ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్ధి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మంచానికి రాహుల్ ఉరేసుకున్నాడు. రాహుల్ ఆత్మహత్యకు గల కారణాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. రాహుల్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లా.ఐఐటీ క్యాంపస్ లోని ఈ బ్లాక్ లో రాహుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
రాహుల్ తన జేబు నుండి పోలీసులు సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఎంటెక్ చదివే రాహుల్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రాహుల్ ఉపయోగించే ల్యాప్ టాప్ లో కీలక సమాచారం ఉందని ఆ సూసైడ్ లేఖలో ఉందని ప్రచారం సాగుతుంది. ఈ దిశగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ప్రముక తెలుగు న్యూస్ చానెల్ ఎబిఎన్ కథనం ప్రసారం చేసింది.
undefined
ఈ క్యాంపస్ లోని 107 రూమ్ నెంబర్ లో మంచానికి రాహుల్ ఉరేసుకొని చనిపోయాడు. రాహుల్ కుటుంబ సభ్యులకు పోలీసులకకు సమాచారం పంపారు. రాహుల్ మృతికి సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాహుల్ ల్యాప్ టాప్ ను ఓపెన్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. అది ఓపెన్ కాలేదు. దీంతో లాప్ టాప్ ఒపెన్ చేయడానికి టెక్నికల్ నిపుణులను పోలీసులు సంప్రదిస్తున్నారని మరో తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. మృతుడి కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత రాహుల్ మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించనున్నారని ఆ కథనం తెలిపింది.