
హైదరాబాద్‌లో (hyderabad) లక్కీ డ్రా మోసం (Lucky Draw ) వెలుగుచూసింది. ప్రజల నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేసిన ముఠా గుట్టురట్టు చేసింది. లక్కీ డ్రా పేరుతో ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు నిర్వాహకులు. ఈ కేసుకు సంబంధించి మల్కాజిగిరిలో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. లక్కీ డ్రా ద్వారా బహుమతులు ఇస్తామంటూ ప్రచారం చేసిన నిందితుల మాటలను నమ్మి.. పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు ప్రజలు. లక్ష్మీ లక్కీ డ్రా (lakshmi lucky draw) పేరుతో మోసాలకు పాల్పడ్డారు నిందితులు. మోసపోయామని తెలిసి బాధితులు లబోదిబోమంటున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.