ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల పెంపు: తెలంగాణలో బీఆర్ఎస్ నిరసనలు

By narsimha lode  |  First Published Mar 2, 2023, 12:32 PM IST

ఎల్‌పీజీ  గ్యాస్ సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ  రాష్ట్ర వ్యాప్తంగా  బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి.  పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని  బీఆర్ఎస్ డిమాండ్  చేసింది.  


హైదరాబాద్: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరల పెంపును నిరసిస్తూ  రాష్ట్ర వ్యాప్తంగా  గురువారంనాడు బీఆర్ఎస్ శ్రేణులు  ఆందోళనకు దిగాయి.  రాష్ట్రంలోని  జాతీయ రహదారులపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి.

గృహవసరాలకు  వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్లపై  రూ. 50 ,  వాణిజ్య సిలిండర్లపై   రూ. 350 లను పెంచుతూ  కేంద్ర ప్రబుత్వం  నిన్న నిర్ణయం తీసుకుంది. ఎల్‌పీజీ సిలిండర్ల  ధరల పెంపును నిరసిస్తూ   ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్  గాంధీ విగ్రహం వద్ద  బీఆర్ఎస్ శ్రేణులు గ్యాస్ సిలిండర్లతో  ఆందోళన నిర్వహించారు.  ఈ ఆందోళనలో  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. 

Latest Videos

undefined

మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని  ఘట్ కేసర్ లో  జరిగిన నిరసన కార్యక్రమంలో  మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డిలు  పాల్గొన్నారు.   హైద్రాబాద్  మీర్ పేటలో  జరిగిన  నిరసన కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి  పాల్గొన్నారు. మహిళలతో  కలిసి మంత్రి  సబితా ఇంద్రారెడ్డి  నిరసన   చేపట్టారు. ఎల్ బీ నగర్ లో  ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనకు దిగాయి.రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా  బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు  ఆందోళనలో  పాల్గొన్నారు.

హైద్రాబాద్ జూబ్లీహిల్స్  నియోజకవర్గంలో  ఎమ్మెల్యే  మాగంటి గోపినాథ్  నేతృత్వంలో  బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. రోడ్డుపై కట్టెల పొయ్యిపై వంటా వార్పు  చేశారు. ఖాళీ గ్యాస్ సిలిండర్లతో  నిరసనకు దిగారు. 

హైద్రాబాద్  కుత్బుల్లాపూర్ లో  ఎమ్మెల్యే వివేకానంద గౌడ్  నేతృత్వంలో  ఆందోళన చేశారు. మరో వైపు నిజామాబాద్  జిల్లా కేంద్రంలో   మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి  నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఆందోళన నిర్వహించారు.   

భారత జనులను పీడించే పార్టీ: హరీష్ రావు

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధర పెంపును  తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు  తప్పుబట్టారు.  గ్యాస్ సబ్సిడీ తగ్గిస్తూ కేంద్రం ఆ భారాన్ని ప్రజలపై మోపుతుందన్నారు. బిజెపి అచ్చే దిన్ అంటే ఇలానే ఉంటుందని  ఆయన  విమర్శించారు. 

బీజేపీ  పాలనతో  సామాన్యులు  సచ్చే దిన్ గా మారుతుందని  మంత్రి హరీష్ రావు  ఆరోపించారు.  బీజేపీతో అచ్చే దిన్  రాదన్నారు. బిజెపికి ఆదానితో సంబంధం ఉందన్నారు. అందుకే  అందుకే  గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచారని  హరీష్ రావు   చెప్పారు.  బిజెపి అంటే భారత జనులను పీడించే పార్టీగా ఆయన  పేర్కొన్నారు.  గల్లి మీటింగ్ కి వచ్చే బిజెపి నాయకులను తరిమికొట్టాలని  ఆయన  ప్రజలను కోరారు.  

click me!