
కరీంనగర్ : మానకొండూర్ మండలం వెగురుపల్లిలో ఓ ఆర్టీసీ బస్సు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వేగురుపల్లి నుండి కరీంనగర్ వెలుతుండగా బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకు ఆపడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.