హైదరాబాద్ లో ప్రేమజంట ఆత్మహత్య... భీమవరంనుంచి వచ్చి...

By SumaBala Bukka  |  First Published May 15, 2023, 12:25 PM IST

హైదరాబాద్ లో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. భీమవరానికి చెందిన ఈ జంట హైదరాబాద్ లో ఓ పెళ్లికి వచ్చి, స్నేహితుడి గదిలో చనిపోయారు. 


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ లో ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు.  వీరిద్దరి ఆత్మహత్యకు కారణం వీరి కుటుంబాల్లో వీరి ప్రేమను అంగీకరించకపోవడమే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులను ఆంధ్రప్రదేశ్ లోని భీమవరానికి  చెందిన జ్యోతి, శ్యామ్ లుగా గుర్తించారు. 

వీరిద్దరూ హైదరాబాదులో ఓ పెళ్లికి హాజరవడానికి వచ్చారు.  ఆ తర్వాత స్నేహితుడు రూమ్ కి వచ్చిన వీరు అక్కడే ఆత్మహత్య చేసుకున్నారు. జ్యోతి విషం తాగి చనిపోయింది. శ్యామ్  ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి  చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.  

Latest Videos

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజ‌యం మాదే... హ్యాట్రిక్ గెలుపుపై బీఆర్ఎస్ నాయ‌కుల ధీమా

కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్యలకు కారణం ప్రేమ వ్యవహారమేనా... లేక మరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

click me!