ఏడాది క్రితమే వివాహం: ప్రేయసి భర్తను చంపి మూటగట్టి బావిలో పడేసిన వ్యక్తి

Published : Jun 20, 2021, 08:17 AM IST
ఏడాది క్రితమే వివాహం: ప్రేయసి భర్తను చంపి మూటగట్టి బావిలో పడేసిన వ్యక్తి

సారాంశం

తెలంగాణలోని జనగామ జిల్లాలో ఈ దారుణమైన హత్య సంఘటన వెలుగు చూసింది. తన ప్రియుడితో ఓ మహిళ తన భర్తను హత్య చేయించింది. వివాహమైన ఏడాదికే ఆ మహిళ ఆ ఘాతుకానికి ఒడిగట్టింది.

జనగామ: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఓ మహిళ తన భర్తను ప్రియుడితో చంపించింది. ఈ సంఘటన తెలంగాణలోని జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం నమిలిగొండలో చోటు చేసుకుంది. ఘట్కేసర్ కు చెందిన అశ్వినికి ఆకుల మహేష్ తో ఏడాది క్రితం పెళ్లయింది. మహేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తూ వచ్చాడు. 

ఈ నెల 5వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన మహేష్ తిరిగి రాలేదు. దీంతో ఘట్కేసర్ పోలీసు స్టేషన్ లో అదృశ్యం కేసు నమోదైంది. పోలీసులు అతని సెల్ నెంబర్ ను విశ్లేషించారు. నమిలిగొండ లోకేషన్ చూపించింది. దాంతో కాల్ లిస్టులో చాలా సార్లు ఉన్న నెంబర్ అడ్రస్ ను పోలీసులు కనిపెట్టారు 

పసుల కుమార్ అనే వ్యక్తి నెంబర్ చాలాసార్లు మహేష్ సెల్ లో రికార్డయి ఉంది. పసుల కుమార్ మిదికొండ గ్రామానికి చెందినవాడని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తాను నేరం చేసినట్లు అంగీకరించాడు. 

మహేష్ ను ఈ నెల 5వతేదీన హైదరాబాదు నుంచి నమిలిగొండలోని తన బావమరిది ఇంటికి తీసుకుని వెళ్లినట్లు తెలిపాడు. మహేష్ కు మద్యం తాగించి రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉంచి తర్వాత నమిలిగొండ శివారులోని రేకుల కొట్టం వద్ద తలపై రాయితో కొట్టి చంపాడు. ఆ తర్వాత శవాన్ని మూటగట్టి బావిలో పడేశాడు. 

పెళ్లికి ముందు నుంచే హతుడు మహేష్ భార్య ఆకుల అశ్వినితో పసుల కుమార్ అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు, తన అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడనే ఉద్దేశంతో హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.  దాంతో నిందితుడు పసుల కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. మృతుని భార్య అశ్వినిని ఘట్కేసర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే