హైద్రాబాద్‌ గుర్రంగూడలో దారుణం: వివాహితపై గొడ్డలితో దాడి, ఆసుపత్రికి తరలింపు

Published : Feb 02, 2021, 05:06 PM ISTUpdated : Feb 02, 2021, 06:46 PM IST
హైద్రాబాద్‌ గుర్రంగూడలో దారుణం: వివాహితపై గొడ్డలితో దాడి, ఆసుపత్రికి తరలింపు

సారాంశం

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ టీచర్స్ కాలనీలో మంగళవారం నాడు దారుణం చోటు చేసుకొంది. విమల అనే వివాహితపై రాహుల్ గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన  ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు  

హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ టీచర్స్ కాలనీలో మంగళవారం నాడు దారుణం చోటు చేసుకొంది. విమల అనే వివాహితపై రాహుల్గొ అనే వ్యక్తి గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన  ఆమెను  కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు.

ఇవాళ మధ్యాహ్నం విమలపై పథకం ప్రకారం రాహుల్ దాడికి దిగారు.  తనపై కేసు పెట్టి జైలుకు పంపించిందనే కోపంతో రాహుల్ ఈ దాడికి దిగినట్టుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు.ఈ దాడి చేసిన తర్వాత రాహుల్ పారిపోయాడు. రాహుల్ పై ఆమె వేధింపుల కేసు పెట్టింది. దీంతో నిందితుడిపై నిర్భయ కేసు పెట్టారు పోలీసులు. ఈ కేసులోనే అరెస్టై జైలుకు వెళ్లి వచ్చిన అతను ఆమెపై ఇవాళ దాడికి దిగాడు. 
 

PREV
click me!

Recommended Stories

Top 5 Beer Brands In Hyderabad: హైదరాబాద్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే టాప్ 5 బీర్లు ఇవే
మీకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? మీకో బ్యాడ్ న్యూస్‌, క్యాష్‌లెస్ చికిత్స‌ల‌కు తాత్కాలిక్ బ్రేక్