హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు... ప్రత్యేక ఏర్పాట్లు...

By AN TeluguFirst Published Feb 2, 2021, 3:58 PM IST
Highlights

హైదరాబాద్ మెట్రో తొలిసారిగా  ఓ గుండె మార్పిడి శస్త్రచికిత్సలో తన వంతు సాయం చేయనుంది. నగరంలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ నేపత్యంలో గుండె తరలింపుకు వైద్యులు హైదరాబాద్ మెట్రోను ఎంచుకున్నారు. దీంతో నగరంలో మొదటిసారిగా మెట్రోతో గ్రీన్ ఛానల్ ను నిర్వహిస్తున్నారు. 

జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్టర్ గోకులే నేతృత్వంలో ఈఆపరేషన్ జరగనుంది. దీంతో  తొలిసారిగా హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఆస్పత్రి సిబ్బంది మెటరో రైలు అధికారులకు సమాచారం ఇవ్వడంతో రైలు అధికారులు అప్రమత్తమయ్యారు. నాగోల్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు నాన్ స్టాప్ గా మెట్రోను నడపనున్నారు.

ఎల్బీనగర్ కామినేని నుంచి జూబ్లీ హిల్స్ అపోలోకు గుండెను ఎలాంటి ఆటంకాలు లేకుండా తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికోసం  నాగోల్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు నాన్ స్టాప్ గా మెట్రోను నడపనున్నారు. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి అపోలో ఆసుపత్రి వరకు కూడా రోడ్డుపై గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తరలించనున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుు వైద్యులు మెట్రోను ఎంచుకున్నారు.

నల్గొండ జిల్లాకు చెందిన 45 యేళ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యారు. అతడి గుండెను దానం చేసేందుకు ఆయన కుటుంబసభ్యులు ముందుకువచ్చారు. 

click me!