ప్రేమ జంటకు కులం అడ్డుగోడ.. చివరకు!

Published : Sep 27, 2021, 07:44 AM IST
ప్రేమ జంటకు కులం అడ్డుగోడ.. చివరకు!

సారాంశం

నెహ్రూ స్థానికంగా సుతారి మేస్త్రీగా పనిచేస్తుండగా... నాగమణి ఇటీవల నర్సింగ్ విద్య పూర్తి చేసుకొని హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరారు,

వారిద్దరూ ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలని ఆశపడ్డారు. కానీ.. వారిద్దరి కులాలు వేరు కావడంతో వారి ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో.. పెళ్లి బంధంతో ఒక్కటవ్వాలని అనుకన్నవారి ఆశలు అడియాశలయ్యాయి. పెళ్లితో ఒక్కటి కాకపోయినా.. కనీసం చావుతో ఒకటి అవుదామని నిర్ణయించుకొని వారు ఏకంగా ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

సూర్యాపేట పురపాలిక పరిధిలోని సుందరయ్యనగర్ కు చెందిన నాగమణి(24), దుబ్బతండాకు చెందిన ధరవత్ నెహ్రూ(28) కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. నెహ్రూ స్థానికంగా సుతారి మేస్త్రీగా పనిచేస్తుండగా... నాగమణి ఇటీవల నర్సింగ్ విద్య పూర్తి చేసుకొని హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో ఉద్యోగంలో చేరారు,

ఈ నేపథ్యంలో వారు తమ ప్రేమ విషయాన్ని ఇటీవల ఇరు కుటుంబాల ముందు ఉంచారు.  అయితే.. కులాలు వేరు అనే కారణంగా నాగమణి తల్లిదండ్రులు వారి ప్రేమను నిరాకరించారు. మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ధరవాత్ నెహ్రూ.. తన నివాసంలో ఉరివేసుకొని చనిపోయాడు.

నెహ్రూ మరణ వార్త తెలుసుకున్న ప్రేయసి నాగమణి కూడా.. అతని మరణ వార్త తట్టుకోలేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది, ఫోన్ కాల్స్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu