పెద్దవాగులో కొట్టుకుపోయిన లారీ: చెట్టును పట్టుకుని వేలాడుతున్న డ్రైవర్

Published : Aug 15, 2020, 10:57 AM ISTUpdated : Aug 15, 2020, 11:04 AM IST
పెద్దవాగులో కొట్టుకుపోయిన లారీ: చెట్టును పట్టుకుని వేలాడుతున్న డ్రైవర్

సారాంశం

తెలంగాణలోని సిద్ధిపేటలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. పొంగిపొర్లుతున్న పెద్దవాగులో లారీ కొట్టుకుపోయింది. డ్రైవర్ చెట్టుకు వేలాడుతూ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

సిద్ధిపేట: తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. వంతెనపై నుంచి వెళ్తున్న లారీ పెద్దవాగులో కొట్టుకుపోయింది. సిద్ధిపేట జిల్లాలోని బస్వాపూర్ వద్ద వంతెనపై నుంచి రెండు మీటర్ల ఎత్తు నుంచి పెద్దవాగు ప్రవహిస్తోంది.

శనివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో అటుగా వెళ్తున్న లారీ పెద్దవాగులో పడి కొట్టుకుపోయింది. డ్రైవర్ ఓ చెట్టుకుని పట్టుకుని వేలాడుతూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. 

డ్రైవర్ ను కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. తగిన చర్యలు వెంటనే చేపట్టాలని మంత్రి హరీష్ రావును జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, ఆర్డీవోలకు ఆదేశాలు జారీ చేశారు. 

హైదరాబాదు, వరంగల్ నుంచి ప్రత్యేక రెస్క్యూ టీమ్ లను రప్పించి లారీ డ్రైవర్ ను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను సూచించారు. 

PREV
click me!

Recommended Stories

Jayalalitha Assets: హైదరాబాద్‌లో జయలలిత భవనానికి GHMC సీల్.. అసలు కారణం ఇదే | Asianet News Telugu
హైదరాబాద్‌లో హనుమజ్జయంతి వేడుకలు.. అంజన్నకు సజ్జనార్ పూజలు | Asianet News Telugu