ఆత్మహత్యల నిరోధానికి పోలీస్ బాస్ మంత్రం ఇదీ..

Published : Jun 07, 2018, 10:54 AM IST
ఆత్మహత్యల నిరోధానికి పోలీస్ బాస్ మంత్రం ఇదీ..

సారాంశం

భవనాల టెర్రాస్ ల నుంచి దూకి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వాటిని ఆపడానికి ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్: భవనాల టెర్రాస్ ల నుంచి దూకి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వాటిని ఆపడానికి ఆదేశాలు జారీ చేశారు. టెర్రాస్ తలుపులకు తాళం వేసి ఉంచాలని ఆయన భవనాల యజమానులకు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియన్లకు సూచించారు. 

నీట్ లో తగిన ర్యాంక్ రాలేదని మనస్తాపానికి గురై 18 ఏళ్ల విద్యార్థిని ఆబిడ్స్ లోని భవనంపై నుంచి దూకి మంగళవారంనాడు ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన తీవ్రంగా కలచివేసింది.

చిన్న వయస్సులో విలువైన ప్రాణాన్ని తీసుకున్న సంఘటనతో తన గుండె బరువెక్కిందని, అకడమిక్ కేంద్రంగా కాకుండా జీవితంలోని సమగ్రతను ఆనందించే విధంగా విలువలను నూరిపోయాల్సి ఉంటుందని ఆయన అన్నారు. 

టెర్రాస్ ల తలుపులు మూసి ఉంచే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!