లోన్ యాప్స్ కేసులో కొత్త కోణం: నకిలీ వే బిల్లులతో చైనాకు డబ్బుల తరలింపు

By narsimha lodeFirst Published Sep 28, 2021, 2:38 PM IST
Highlights


లోన్ యాప్స్ కేసులో కొత్త కోణం వెలుగు చూసింది.  నకిలీ పత్రాలను సృష్టించి చైనాకు డబ్బులను తరలించినట్టుగా గుర్తించారు ఈడీ అధికారులు.  రూ. 450 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకొన్నట్టుగా నకిలీ వే బిల్లులు సృష్టించి డబ్బులను చైనాకు తరలించారని ఈడీ అధికారులు గుర్తించారు.

హైదరాబాద్: లోన్ యాప్స్ (loan apps) కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. లోన్స్ యాప్స్ కేసులో ఇప్పటికే రూ. 5 వేల కోట్లను చైనాకు(china) తరలించినట్టుగా పోలీసులు (police) గుర్తించారు. అయితే ఈ కేసులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈడీ(enforcement directorate) దర్యాప్తులో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈడీ ఫిర్యాదుతో సీసీఎస్ (ccs )పోలీసులు మరో కేసు నమోదు చేశారు. 

కొత్త పద్దతిలో చైనాకు డబ్బులను ఈ ముఠా తరలించిందని ఈడీ గుర్తించింది. ఈ యాప్స్ కేసులో సీసీఎస్  ఈడీ అధికారులకు లేఖ రాసింది.దీంతో సీసీఎస్ నుండి సేకరించిన సమాచారంతో ఈడీ అధికారులు దర్యాప్తు చేశారు.ఈ దర్యాప్తులో కీలక సమాచారం వెలుగు చూసింది.

విమానాల (flight) ద్వారా వస్తువులను దిగుమతి చేసుకొన్నట్టుగా పత్రాలను సృష్టించి చైనాకు డబ్బులను తరలించినట్టుగా గుర్తించారు.ఈ పత్రాలను పరిశీలించిన ఈడీ అధికారులు కీలక విషయాలను గుర్తించారు.రూ.450 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకొన్నట్టుగా నకిలీ పత్రాలు సృష్టించారని ఈడీ గుర్తించింది.వే బిల్స్ పరిశీలించి నకిలీవని ఈడీ అధికారులు  తేల్చారు.ఈడీ ఫిర్యాదుతో సీసీఎస్ లో లోన్ యాప్స్ ప్రతినిధులపై కేసు నమోదు చేశారు.

click me!