బీరు సీసాలో బల్లి

Published : Jun 30, 2017, 11:21 AM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
బీరు సీసాలో బల్లి

సారాంశం

పాపం ఆయన టండా టండా కూల్ కూల్ అని బీరు తాగుదామనుకున్నడు. బీరు సీసా చూసి షాక్ తిన్నడు. సీసా మూత ఓపెన్ చేద్దామనుకోగానే అందులో చచ్చిపోయిన బల్లి కనబడ్డది. వెంటనే కన్నుగుడ్లు పెద్దగా చేసి మళ్లా సీసాలోపలకి చూసిండు. మల్లా బల్లి క్లియర్ గ కనబడ్డది. దీంతో ఆ బీరు సీసా తాగకుండానే పక్కన పెట్టిండు.

టండా టండా కూల్ కూల్ అని బీరు తాగుదామనుకున్నడు. బీరు సీసా చూసి షాక్ తిన్నడు. సీసా మూత ఓపెన్ చేద్దామనుకోగానే అందులో చచ్చిపోయిన బల్లి కనబడ్డది. వెంటనే కన్నుగుడ్లు పెద్దగా చేసి మళ్లా సీసాలోపలకి చూసిండు. మల్లా బల్లి క్లియర్ గ కనబడ్డది. దీంతో ఆ బీరు సీసా తాగకుండానే పక్కన పెట్టిండు.

 

బీరు సీసాలో బల్లి సంఘటన మందు ప్రియులకు కలవరపెడుతోంది. ఈ సంఘటన ఘట్కేసర్ లో గురువారం జరిగింది. ఎల్‌బీ నగర్‌కు చెందిన విక్రమ్‌రెడ్డి గురువారం ఘట్‌కేసర్‌లోని బంధువుల ఇంటికి పోయిండు. స్థానికంగా ఉన్న ఎన్‌ఎఫ్‌సీ నగర్‌లోని టీఎస్‌బీసీఎల్‌ లిక్కర్‌ షాపులో ఐదు బీర్లను కొన్నాడు. వాటిని తాగుదామని ఒపెన్‌ చేస్తుండగా అందులోని ఒక సీసాలో చచ్చిపోయిన బల్లి కనిపించింది. ఆందో ళనకు గురైన అతడు వాటిని పక్కన పడేశాడు. ఈ ఘటనపై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

 

మొత్తానికి చల్లచల్లని బీర్ తాగకుండానే పరేషాన్ అయ్యారు విక్రం రెడ్డి, ఆయన దోస్తులు.

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే