సాహితీవేత్త నిజాం వెంకటేశం ఇక లేరు..

By team teluguFirst Published Sep 19, 2022, 8:12 AM IST
Highlights

తెలుగు సాహితీలోకాన్ని ఎంతో సుపరిచితం అయిన నిజాం వెంకటేశం మరణించారు. ఆయన ఇంట్లో ఉన్న సమయంలో గుండెపోటు రావటంతో చనిపోయారు. 

ప్ర‌ముఖ సాహితీవేత్త నిజాం వెంకటేశం ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయారు. ప‌ద్మారావు న‌గ‌ర్ లోని త‌న ఇంట్లో ఉన్న స‌మ‌యంలో ఆదివారం రాత్రి గుండెపోటు రావ‌డంతో త‌న 76 ఏళ్ల వ‌య‌స్సులో చ‌నిపోయారు. తెలుగు సాహితీ లోకానికి సేవ‌లందించిన ఆయ‌న స్వ‌స్థ‌లం సిరిసిల్ల‌. ఆయ‌న ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీర్ గా ప‌ని చేసి రిటైర్డ్ అయ్యారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం... రామచంద్ర పిళ్లైని ప్రశ్నిస్తోన్న ఈడీ

వెంకటేశం వ‌ర్థ‌మాన క‌వుల‌ను ఎంత‌గానో ప్రోత్స‌హించేవారు. ప‌లు ర‌చ‌న‌ల‌కు ఆయ‌న అనువాదం కూడా చేశారు. అలిశెట్టి ప్ర‌భాక‌ర్, సుద్ధాల అశోక్ తేజ వంటి సాహితీవేత్త‌లను ఆయ‌న మొద‌ట్లోనే ప్రోత్స‌హించారు. లాయ‌ర్ విద్యాసాగ‌ర్ రెడ్డి రాసిన ప‌లు పుస్త‌కాల‌ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోని అనువాదం చేశారు. ప్ర‌ముఖ ప్ర‌కృతి వ్య‌వ‌సాయదారుడు సుభాష్ పాలేక‌ర్ వ్య‌వ‌సాయంలో అనుస‌రించే ప‌ద్ద‌తుల‌పై కూడా ఆయ‌న బుక్ రాశారు.

దర్శనం కోసం వచ్చి రాజకీయాలు అవసరమా... కేటీఆర్‌పై విమర్శలొద్దు : రఘునందన్‌పై చెన్నమనేని ఫైర్

వెంక‌టేశం మృతి ప‌ట్ల ప్రొఫెస‌ర్ జ‌య‌ధీర్ తిరుమ‌ల రావు, ఓయూ రిటైర్డ్ ప్రొఫెస‌ర్ వేముల స‌త్య‌నారాయ‌ణ‌, న‌లిమెల భాస్క‌ర్, ప‌త్తిపాక మోహ‌న్, స‌త్య‌నారాయ‌ణలు విచారం వ్య‌క్తం చేశారు. ఆయ‌న అంత్య‌క్రియ‌ల‌ను బుధ‌వారం నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. 

click me!