ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం... రామచంద్ర పిళ్లైని ప్రశ్నిస్తోన్న ఈడీ

By Siva KodatiFirst Published Sep 18, 2022, 9:54 PM IST
Highlights

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఆయన ఏ 14గా వున్న సంగతి తెలిసిందే. రాబిన్ డిస్టలరీస్ పేరుతో ఆయన వ్యాపారం చేశారు. 

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రామచంద్ర పిళ్లైని ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో పిళ్లై ఏ 14గా వున్న సంగతి తెలిసిందే. రాబిన్ డిస్టలరీస్ పేరుతో ఆయన వ్యాపారం చేశారు. ఇదే సమయంలో ఢిల్లీ పెద్దలకు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  12 మందికి ఈడీ అధికారులు శుక్రవారం నాడు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కాంతో సంబంధం ఉందనే అనుమానాలతో  ఈడీ అధికారులు18 కంపెనీలతో పాటు 12 మందికి నోటీసులు ఇచ్చారు. అరుణ్ రామచంద్రన్ పిళ్లై, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్ పల్లి, బుచ్చిబాబు, చందన్ రెడ్డి, పెరమన్ రిచర్డ్, విజయ్ నాయర్ ,దినేష్ ఆరోరా, వై. శశికళ,  రాఘవ మాగుంట, సమీర్ మహంద్రు తదితరులకు నోటీసులు ఇచ్చారు. 

Also REad:ఢిల్లీ లిక్కర్ స్కాం: 12 మంది సహ 18 కంపెనీలకు ఈడీ నోటీసులు

ఇండో స్పిరిట్స్, మాగుంటి ఆగ్రోఫామ్స్, ట్రైడెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ ఆవంతిక కాంట్రాక్టర్స్ , ఆర్గానామిక్స్ ఈకో సిస్టమ్స్ లిమిటెడ్, అరబిందో ఫార్మా, పిక్సీ ఎంటర్ ప్రైజెస్, ఎన్రికా ఎంటర్ ప్రైజెస్, ప్రీనీస్ ఎంటర్ ప్రైజెస్, జైనాబ్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, బాలాజీ డిస్టిలరీస్, టెక్రా, ఫెరల్ డిస్టిలరిస్, హివిడే ఎంటర్ ప్రైజెస్, వైకింగ్ ఎంటర్ ప్రైజెస్, డైయాడిమ్ ఎంటర్ ప్రైజెస్, డిప్లొమాట్ ఎంటర్ ప్రైజెస్, పెగాసస్ ఎంటర్ ప్రైజెస్, రాబిన్ డిస్టిలరిస్ లకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. 
 

click me!