రాడిసన్ బ్లూ ప్లాజా‌ వ్యవహారం.. లేట్ నైట్ రేవ్ పార్టీలో నిహారిక, పాల్గొన్న వారు వీరే

Siva Kodati |  
Published : Apr 03, 2022, 03:12 PM ISTUpdated : Apr 03, 2022, 03:44 PM IST
రాడిసన్ బ్లూ ప్లాజా‌ వ్యవహారం.. లేట్ నైట్ రేవ్ పార్టీలో నిహారిక, పాల్గొన్న వారు వీరే

సారాంశం

బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో రేవ్ పార్టీలో పాల్గొన్న వారి పేర్లు పలు మీడియా ఛానెళ్లలో వస్తున్నాయి. పబ్‌లో ఉన్న దాదాపు 157 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది పబ్ సిబ్బంది ఉన్నారు.   

రాడిసన్ బ్లూ ప్లాజా హోటలోని (radisson blu plaza) పుడింగ్ మింక్ పబ్‌లో (pudding mink pub) లేట్ నైట్ పార్టీకి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పుడింగ్ మింక్ పబ్‌ లేట్ నైట్ పార్టీకి సంబంధించి సమాచారం రావడంతో.. ఈ రోజు తెల్లవారుజామున పబ్‌పై టాస్క్‌ఫోర్స్ అధికారులు డెకాయ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ డెకాయ్ ఆపరేషన్‌లో నార్త్, సెంట్రల్, వెస్ట్ జోన్ పోలీసులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అక్కడ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. పబ్‌లో ఉన్న దాదాపు 157 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిలో 99 మంది యువకులు, 39 మంది యువతులు, 19 మంది పబ్ సిబ్బంది ఉన్నారు. 

పబ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిని పలువురు సెలబ్రిటీలు, బడా బాబుల పిల్లలు ఉన్నారు. వీరిలో ప్రముఖ సింగర్, బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ ఉన్నట్టుగా ఇప్పటికే బహిర్గతం అయిన సంగతి తెలిసిందే. తాజాగా పబ్‌లో పట్టుబడిన వారిలో ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె, సినీ నటి నిహారిక కూడా ఉన్నట్టుగా కథనాలు వస్తున్నాయి. అంతేకాకుండా ఓ మాజీ డీజీపీ కూతురుతో పలువురు ప్రముఖుల పిల్లలు ఉన్నట్టుగా తెలుస్తోంది. 

రేవ్ పార్టీ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పబ్ నిర్వాహకులు అభిషేక్ ఉప్పాలా..? అనిల్ కుమార్‌తో పాటు మేనేజర్ కునాల్‌ను అరెస్ట్ చేశారు. 3 నెలల క్రితమే పబ్‌ని లీజుకు తీసుకున్నారు అభిషేక్, అనిల్ కుమార్. టాస్క్‌ఫోర్స్ దాడితో డ్రగ్స్‌ని ఎక్కడపడితే అక్కడే పడేశారు యువతీ యువకులు. దాడుల సమయంలో 96 మంది యువకులు, 36 మంది ఉన్నట్లు గుర్తించారు. పోలీసులను చూసి కిటికీల్లోంచి బయటకు పడేశారు యువతీ యువకులు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బాత్రూంలోకి పారిపోయారు యువతీ యువకులు. 

అభిషేక్, అనిల్ కుమార్, కునాల్ పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ పార్టీలో మేనేజర్ కునాల్ పాత్ర ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. డ్రగ్స్ పెడ్లర్‌తో కునాల్‌కు సంబంధాలు వున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రగ్స్ పార్టీకి వచ్చిన వారితో ఫోన్‌ కాల్స్ మాట్లాడాడు. డ్రగ్స్‌తో వచ్చిన వారికి దగ్గరుండి సెక్యూరిటీ క్లియర్ చేయించాడు కునాల్. అంతేకాకుండా డ్రగ్స్ కోసం కోడ్ లాంగ్వేజ్ వాడినట్లు పోలీసులు నిర్ధారించారు. బ్రో, స్టఫ్, సోడా, కూల్ లాంటి కోడ్ భాషల్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు రాగానే కునాల్ డ్రగ్స్‌తో వచ్చిన వారిని అప్రమత్తం చేశాడు. 

ఈ వ్యవహారంలో డ్రగ్స్ కోణం కూడా వెలుగులోకి రావడంతో పోలీసులు పలువురికి మాదక ద్రవ్యాల కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో కొన్ని టీవీ ఛానెళ్లలో ఈ పార్టీలో పాల్గొన్న యువతీ యువకుల పేర్లు బయటకు వస్తున్నాయి. ఈ కథనాల ప్రకారం.. నిందితుల పేర్లు 

  1. ఆదిత్య పమ్నయ్
  2. సుహృద్ధ్ కసిరెడ్డి
  3. ప్రణయ్ హరిహరన్
  4. ప్రతాప్ శ్యామ్ మీనన్
  5. ఎన్ అనుమోల్
  6. లక్ష్మీ నరసింహారెడ్డి
  7. అయాన్ త్రిపురనేని
  8. నారల్ కిషోర్ రెడ్డి
  9. కడియం వంశీనాథ్
  10. ప్రదీప్ సింగ్
  11. సిద్ధార్థ్ గల్లా
  12. మధుసూదన్ రావు
  13. అశోక్ ముమ్మిడి
  14. పాలడుగు సాయితేజ
  15. దుగ్గిరాల కృష్ణ
  16. వినయ్ కుమార్
  17. భరత్ అనుమోలు
  18. త్రిపురనేని ఆదిత్య
  19. అఖిలేష్ యాదవ్
  20. చలసాని వినప్ దత్
  21. వినోద్ కుమార్
  22. శుశృత్ రెడ్డి
  23. ప్రణయ్ రెడ్డి
  24. రామికిరణ్
  25. రాజ్‌కుమార్
  26. హర్షవర్థన్
  27. వివేక్ సాయి
  28. ఈశ్వర్ శంకర్
  29. రోహన్
  30. సుధీర్ కుమార్
  31. ఆనంద్ రాజ్
  32. ప్రతీక్
  33. సత్యజిత్ రెడ్డి
  34. ప్రణవ్ మహేశ్వరి
  35. హర్ష
  36. అభిషేక్
  37. సాహిల్ రెడ్డి
  38. అనూజ్ గోయల్
  39. సంజన్ కుమార్
  40. సామ హవీష్
  41. సాహిత్
  42. భరత్ భార్గవ్ గౌడ్
  43. సాయి కిరణ్
  44. దాట్ల చైతన్య

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్