ప్రియుడిపై మోజు... భర్త దారుణ హత్య.. కోర్టు జీవిత ఖైదు

Published : Dec 28, 2019, 08:38 AM IST
ప్రియుడిపై మోజు... భర్త దారుణ హత్య.. కోర్టు జీవిత ఖైదు

సారాంశం

ఆరో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. చేరో 5 వే ల జరిమానా చెల్లించాలని, లేకపోతే మరో ఆర్నెల్ల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని జడ్జి సత్యేంద్ర తీర్పులో పేర్కొన్నారు. 

ప్రియుడిపై మోజుతో ఓ వివాహిత కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా హత్య చేసింది. ఈ హత్య కేసులో... సదరు మహిళ, ఆమె ప్రియుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కక్షతో ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో దోషులు టి.లక్ష్మణ్‌, బి.పద్మలకు జీవితఖైదు శిక్ష పడింది. ఆరో అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి శుక్రవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. చేరో 5 వే ల జరిమానా చెల్లించాలని, లేకపోతే మరో ఆర్నెల్ల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని జడ్జి సత్యేంద్ర తీర్పులో పేర్కొన్నారు. 

రసూల్‌పురాకు చెందిన కుమార్‌, పద్మ భార్యాభర్తలు. వారికి లక్ష్మణ్‌తో ఏర్పడింది. వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న కుమార్‌...ఇంటికి రావద్దని లక్ష్మణ్‌ను హెచ్చరించాడు. దీంతో కక్ష పెంచుకున్న లక్ష్మణ్‌... 2013 సెప్టెంబరు 22న పద్మ సహకారంతో కుమార్‌కు ఉరివేసి హత్య చేశాడు.

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్